Project K : చేయి చేయి కలిపిన ప్రభాస్ – దీపికా పదుకొణె

తాజాగా 'ప్రాజెక్టు k' సినిమా షూట్ కూడా మొదలు పెట్టేశాడు. ఈ సినిమా షూటింగ్ కోసం దీపికా పదుకొణె రెండు రోజుల క్రితమే హైదరాబాద్ వచ్చింది. 'ప్రాజెక్ట్ k' షూటింగ్ ని నిన్న.......

Project K : చేయి చేయి కలిపిన ప్రభాస్ – దీపికా పదుకొణె

Project K

Project K :  రెబల్ స్టార్ ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమాల షూటింగ్స్ తో బిజీగా ఉన్నాడు. ‘రాధేశ్యామ్’ రిలీజ్ కి రెడీగా ఉండగా, ‘ఆదిపురుష్’ సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఒక పక్క ‘సలార్’ సినిమా షూటింగ్ చేస్తూనే తాజాగా ‘ప్రాజెక్టు k’ సినిమా షూట్ కూడా మొదలు పెట్టేశాడు.

Pawan Kalyan : పంతానికి పోతే నా సినిమాలను ఉచితంగా ఆడిస్తా : పవన్ కళ్యాణ్

‘మహానటి’ సినిమాతో సావిత్రి గారి జీవితాన్ని అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు నాగ్ అశ్విన్‌ దర్శకత్వంలో ‘ప్రాజెక్ట్ k’ చేయబోతున్నాడు. ఈ సినిమా భారీ బడ్జెట్ తో, భారీ తారాగణంతో తెరకెక్కుతుంది. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తుండగా, బాలీవుడ్ సూపర్ స్టార్, బిగ్ బి అమితాబ్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో మరింతమంది బాలీవుడ్ యాక్టర్స్ కూడా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ ని ప్రారంభించారు.

Sudheer-Rashmi : ‘ఢీ’ షో నుంచి సుధీర్, రష్మీ అవుట్.. షో చూడం అంటున్న అభిమానులు

ఈ సినిమా షూటింగ్ కోసం దీపికా పదుకొణె రెండు రోజుల క్రితమే హైదరాబాద్ వచ్చింది. ‘ప్రాజెక్ట్ k’ షూటింగ్ ని నిన్న అధికారికంగా హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభించారు. ప్రభాస్, దీపికలపై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. సినిమా యూనిట్ షూటింగ్ నుంచి కొన్ని సెకెన్ల చిన్న షాట్ వీడియో బైట్‌ను విడుదల చేశారు. ఈ వీడియోలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ యాక్షన్ చెప్పగా ప్రభాస్ దీపికకి చెయ్యి అందిస్తున్నాడు. ఆ తర్వాత డైరెక్టర్ కట్ చెప్పడంతో ఈ వీడియో బైట్ ముగిసింది. అయితే ఇందులో కేవలం ప్రభాస్, దీపికా చేతులు మాత్రమే చూపించడం విశేషం.