Project K: నాగ్ అశ్విన్‌తో ప్రభాస్ ‘ప్రాజెక్ట్ K’ కూడా రెండు పార్టులా..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘సలార్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి హైప్ క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తుండగా, పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమా రానుండటంతో ఈ మూవీపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.

Project K: నాగ్ అశ్విన్‌తో ప్రభాస్ ‘ప్రాజెక్ట్ K’ కూడా రెండు పార్టులా..?

Prabhas Project K Movie To Be Made In Two Parts

Project K: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘సలార్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి హైప్ క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తుండగా, పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమా రానుండటంతో ఈ మూవీపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో ప్రభాస్ లుక్ ఇప్పటికే ప్రేక్షకుల్లో అంచనాలను అమాంతం పెంచేసింది. ఈ సినిమా తరువాత ప్రభాస్ నటిస్తున్న ‘ప్రాజెక్ట్-K’పై ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో అదిరిపోయే అంచనాలు ఏర్పడ్డాయి.

Project K Making Video : న్యూ ఇయర్ స్పెషల్.. ప్రాజెక్ట్ K మేకింగ్ వీడియో వదిలిన టీం.. టైర్ తయారు చేయడానికి ఇంతా??

ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌ను దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తుండగా, పూర్తి సైన్స్ ఫిక్షన్ మూవీగా ఈ సినిమా రానుండటంతో ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పనులు మొదలుపెట్టిన ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే లాంటి వారు నటిస్తుండటంతో ఈ సినిమాపై దేశవ్యాప్తంగా అంచనాలు క్రియేట్ అయ్యాయి. కాగా, ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో ఓ వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది.

ప్రాజెక్ట్-K సినిమాను కూడా రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా తొలి పార్ట్ షూటింగ్ ఇప్పటికే ముగించుకుని వచ్చే ఏడాది ఏప్రిల్‌లో రిలీజ్‌కు రెడీ అవుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. సూపర్ హీరో కాన్సెప్ట్‌తో ఈ సినిమా వస్తుండటంతో ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. మరి నిజంగానే నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ ప్రస్టీజియస్ మూవీ రెండు పార్టుల్లో రాబోతుందా అనేది చూడాలి.