Prabhas : సలార్ వర్సెస్ ప్రాజెక్ట్ K.. నెల గ్యాప్ లో ప్రభాస్ రెండు భారీ బడ్జెట్ సినిమాలు.. వర్కౌట్ అవుతుందా?

ప్రస్తుతం ప్రభాస్ వరుస భారీ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రభాస్ నటించిన ఆదిపురుష్ 2023 సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఇక ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ సినిమాని 2023 సెప్టెంబర్ 28న రిలీజ్ చేయనున్నట్టు ఇటీవలే ప్రకటించారు. తాజాగా.................

Prabhas : సలార్ వర్సెస్ ప్రాజెక్ట్ K.. నెల గ్యాప్ లో ప్రభాస్ రెండు భారీ బడ్జెట్ సినిమాలు.. వర్కౌట్ అవుతుందా?

Prabhas :  టాలీవుడ్‌లో రీసెంట్‌గా రిలీజ్ అయిన ‘సీతారామం’ సినిమా మంచి విజయం సాధించి, కలెక్షన్లు కూడా బాగా తీసుకొస్తుంది. ఈ సినిమాని స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మించారు. తాజాగా ఆయన ‘ఆలీతో సరదాగా’ టాక్ షోలో పాల్గొని పలు ఆసక్తికర విషయాలని తెలియచేశారు. ఇదే బ్యానర్ పై ప్రభాస్ తో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ K నిర్మిస్తున్నారు. ఈ ఇంటర్వ్యూలో ప్రాజెక్ట్ K రిలీజ్ డేట్ ని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు అశ్వినీదత్.

ప్రస్తుతం ప్రభాస్ వరుస భారీ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రభాస్ నటించిన ఆదిపురుష్ 2023 సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఇక ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ సినిమాని 2023 సెప్టెంబర్ 28న రిలీజ్ చేయనున్నట్టు ఇటీవలే ప్రకటించారు. తాజాగా అశ్వినీదత్ నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ K రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చారు.

అశ్వినీదత్ మాట్లాడుతూ.. ప్రాజెక్ట్ K సినిమా దాదాపు 55 శాతం షూటింగ్ అయిపోయింది. మరోపక్క VFX వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఈ సినిమాని వచ్చే సంవత్సరం దసరాకి రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను. అప్పటికి సినిమా పూర్తవుతుంది” అని తెలిపారు. 2023 దసరా అక్టోబర్ 24న వచ్చింది, అక్టోబర్ 23 ప్రభాస్ పుట్టిన రోజు ఉంది. దీంతో వచ్చే సంవత్సరం ప్రభాస్ పుట్టిన రోజుకి ప్రాజెక్ట్ K సినిమా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.

Vijay – Ananya : థ్యాంక్యూ ఆంటీ.. విజయ్ ఇంట్లో స్పెషల్ పూజలు చేసిన అనన్య పాండే.. విజయ్ తల్లికి థ్యాంక్స్ చెప్తూ పోస్ట్..

అయితే సలార్ కూడా 2023 సెప్టెంబర్ లోనే అనౌన్స్ చేశారు. నెల గ్యాప్ లో ప్రాజెక్ట్ K కూడా రిలీజ్ చేస్తామంటున్నారు. ఇది సాధ్యమయ్యే పనేనా అని ఇండస్ట్రీ వర్గాలు అనుకుంటున్నాయి. రెండు భారీ బడ్జెట్ సినిమాలు నెల గ్యాప్ లో అది కూడా ప్రభాస్ లాంటి స్టార్ హీరో సినిమాలు రిలీజ్ అవుతాయా అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు సినిమాలలో కచ్చితంగా ఏదో ఒకటి వాయిదా పడే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. ప్రాజెక్టు K అప్పటికి పూర్తవ్వదని, కచ్చితంగా వాయిదా పడుతుందని ఫ్యాన్స్ అంటున్నారు. ఒకవేళ రెండు సినిమాలు నెల గ్యాప్ తో రిలీజ్ అయితే మాత్రం బాక్సాఫీస్ బద్దలు కొట్టడం ఖాయం అని అంటున్నారు డార్లింగ్ ఫ్యాన్స్.