Salaar : ఇటలీ మీడియాలో ‘సలార్’ గురించి న్యూస్.. ఏంటో తెలుసా?

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ 'సలార్'. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ మూవీ గురించి ఇటలీ మీడియాలో..

Salaar : ఇటలీ మీడియాలో ‘సలార్’ గురించి న్యూస్.. ఏంటో తెలుసా?

prabhas salaar movie news was printed on italy media

Salaar : రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ‘సలార్’. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాతో శ్రుతి హాసన్ మొదటిసారిగా ప్రభాస్ తో జత కడుతుంది. ఇటీవలే ఈ భామకి సంబంధించిన షూటింగ్ పార్ట్ మొత్తం కంప్లీట్ చేసుకుంది. మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు విలన్ పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం యాక్షన్ పార్ట్ చిత్రీకరణ జరుపుకుంటున్నట్లు తెలుస్తుంది.

Adipurush : శ్రీరామనవమికి ఆదిపురుష్ కొత్త టీజర్?

కాగా ఈ మూవీ కొత్త షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ త్వరలో ఇటలీ వెళ్లనుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఇటలీ మీడియా ఒక ఆర్టికల్ రాసింది. ఇటలీలోని లుకానియన్ సిటీలో ఈ షూటింగ్ జరగబోతుంది. ఇక ఈ ఆర్టికల్ ఇంటరెస్టింగ్ విషయం ఏంటంటే.. ఈ మూవీ రెండు భాగాలుగా రాబోతుంది అంటూ చెప్పుకొచ్చారు. గత కొన్ని రోజులుగా ఈ సినిమా 2 పార్ట్స్ రాబోతుంది అంటూ వార్తలు వస్తున్నా మూవీ టీం నుంచి ఎటువంటి క్లారిటీ లేదు. ఇప్పుడు ఫారిన్ మీడియా కూడా రెండు భాగాలు గురించి వార్త రాయడంతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

Salaar: సలార్ కోసం ప్రశాంత్ నీల్ భారీగా ప్లాన్ చేస్తున్నాడట!

కేజీఎఫ్ చిత్రాన్ని నిర్మించిన హొంబాలే ఫిలింస్ ఈ సినిమాని దాదాపు 200 కోట్ల బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తుంది. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ ఏడాది సెప్టెంబర్ లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది ఇలా ఉంటే ప్రభాస్ నటించిన ఆదిపురుష్ మూవీ గ్రాఫిక్ వర్క్ కోసం పోస్ట్‌పోన్ అయిన సంగతి తెలిసిందే. జూన్ నెలలో ఈ సినిమాని తప్పకుండా రిలీజ్ చేస్తాము అని ప్రకటించారు. కానీ విడుదల దగ్గర పడుతున్నా మూవీ టీం మాత్రం ఎటువంటి ప్రమోషన్స్ మొదలు పెట్టలేదు. మరి చెప్పిన తేదీకే సినిమాని రిలీజ్ చేస్తారా? లేదా? చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Fukkard (@fukkard)