Salaar : సలార్ నుంచి అప్డేట్.. ఆమె పాత్ర షూటింగ్ పూర్తి.. టీజర్ అప్పుడే వస్తుందా?

ప్రభాస్ సినిమాలో ముఖ్య పాత్ర చేస్తున్న తమిళ భామ షూటింగ్ కంప్లీట్ అండ్ టీజర్ గురించి వస్తున్న వార్తల్లో నిజమెంత ఉంది?

Salaar : సలార్ నుంచి అప్డేట్.. ఆమె పాత్ర షూటింగ్ పూర్తి.. టీజర్ అప్పుడే వస్తుందా?

Prabhas Salaar shooting update and teaser release news

Prabhas Salaar : రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ సలార్. కేజీఎఫ్ (KGF) వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా వస్తుండడంతో ఈ మూవీ పై ఇంకొంచెం ఎక్కువగానే అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాని కూడా రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ప్రభాస్ ఫాదర్ అండ్ సన్ క్యారెక్టర్స్ లో రెండు విభిన్న పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ కి హీరోయిన్ గా శ్రుతిహాసన్ (Shruti Haasan) హీరోయిన్ గా నటిస్తుంది. మూవీలోని శ్రుతి పాత్ర షూటింగ్ మొత్తాన్ని ఆల్రెడీ పూర్తి చేసేసిన సంగతి తెలిసిందే.

Adipurush : బాహుబలి సెంటిమెంట్‌ని ఫాలో అవుతున్న ఆదిపురుష్.. తిరుపతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. ఎప్పుడో తెలుసా?

ఇక ఈ సినిమాలో తమిళ నటి శ్రియా రెడ్డి (Sriya Reddy) ఒక బలమైన పాత్రలో నటిస్తుంది. తెలుగు ఆడియన్స్ కి ఈ భామ విశాల్ ‘పొగరు’ సినిమాతో పరిచయమైంది. ఆ సినిమాలో నెగటివ్ పాత్రలో కనిపించిన శ్రియా.. సలార్ లో ఎటువంటి పాత్రలో నటిస్తుందో అని అందరిలో ఆసక్తి నెలకుంది. తాజాగా ఈ సినిమాలో ఈమె పాత్రని కూడా దర్శకుడు పూర్తి చేసేశాడు. ఆ విషయాన్ని తెలియజేస్తూ శ్రియా రెడ్డి తన సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ వేసింది. సలార్ లోని ముఖ్య పాత్ర కోసం తనని సెలెక్ట్ చేసుకున్నందుకు ప్రశాంత్ నీల్ కి థాంక్యూ చెప్పింది.

Jaitra : కడపజిల్లా రైతు కథ ‘జైత్ర’ సినిమా.. అగ్రికల్చర్ సైటిస్ట్‌తో రైతు ప్రేమ!

కాగా ఈ మూవీ టీజర్ గురించి సోషల్ మీడియాలో ఒక వార్త హల్ చల్ చేస్తుంది. జూన్ 16న ప్రభాస్ నటించిన మైథిలాజికల్ మూవీ ఆదిపురుష్ (Adipurush) రిలీజ్ అవుతున్న సంగతి అందరికి తెలిసిందే. అదే రోజు సలార్ మొదటి టీజర్ ని కూడా ప్రదర్శించనున్నారట. అయితే మూవీ టీం నుంచి ఈ విషయం గురించి ఎటువంటి అప్డేట్ లేదు. గతంలో కూడా సలార్ గ్లింప్స్ గురించి వార్తలు రాగా.. మూవీ టీం అవన్నీ ఫేక్ అంటూ వెంటనే క్లారిటీ ఇచ్చారు. మరి ఇప్పుడు ఈ టీజర్ వార్తలు పై కూడా రెస్పాండ్ అయ్యి ఏ విషయం అనేది క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Sriya Reddy (@sriya_reddy)