Prabhas: మరో స్టార్ డైరెక్టర్‌కు ఓకే చెప్పిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఆదిపురుష్ సినిమాను ఫినిష్ చేసిన ప్రభాస్, ఆ తరువాత సలార్, ప్రాజెక్ట్-K చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇక ఈ సినిమాలతో పాటు దర్శకుడు మారుతి డైరెక్షన్‌లోనూ ప్రభాస్ ఓ సినిమాను చేస్తున్నాడు.

Prabhas: మరో స్టార్ డైరెక్టర్‌కు ఓకే చెప్పిన ప్రభాస్..?

Prabhas Says Ok To Sukumar

Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఆదిపురుష్ సినిమాను ఫినిష్ చేసిన ప్రభాస్, ఆ తరువాత సలార్, ప్రాజెక్ట్-K చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇక ఈ సినిమాలతో పాటు దర్శకుడు మారుతి డైరెక్షన్‌లోనూ ప్రభాస్ ఓ సినిమాను చేస్తున్నాడు.

Prabhas : బాలకృష్ణకి జోశ్యం చెప్పిన ప్రభాస్.. అన్‌స్టాపబుల్‌ స్నీక్ పీక్ చూశారా?

ఈ సినిమాలతో పాటు అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో ‘స్పిరిట్’ అనే సినిమాను కూడా లైన్‌లో పెట్టాడు ఈ బాహుబలి యాక్టర్. అయితే ఈ సినిమాలు ఇంకా పూర్తి కాకముందే, ఇప్పుడు మరో స్టార్ డైరెక్టర్‌కు ఓకే చెప్పాడట ప్రభాస్. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం ‘పుష్ప-2’ సినిమాను తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను ఈసారి పాన్ ఇండియా మూవీగా మరింత ప్రెస్టీజియస్‌గా తీర్చిదిద్దుతున్నాడు సుకుమార్. అయితే, ఇటీవల ఆయన ప్రభాస్‌ను కలిసినప్పుడు ఓ స్టోరీలైన్‌ను చెప్పుకొచ్చాడట.

Prabhas: ప్రభాస్ ముందుగా ఏ సినిమాను తీసుకొస్తాడో..?

అది నచ్చిన ప్రభాస్ కూడా దాన్ని పూర్తిగా డెవలప్ చేయమని కోరాడట. దీంతో సుకుమార్ చెప్పిన స్టోరీలైన్‌కు ప్రభాస్ ఓకే చేశాడని.. త్వరలోనే ఈ కాంబో కూడా సెట్ అవుతుందనే వార్త ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. మరి ఈ కాంబినేషన్ సెట్ కావాలంటే కనీసం 2025 సంవత్సరం వరకు ఆగాల్సిందే అంటున్నారు సినీ ఎక్స్‌పర్ట్స్.