Prabhas : ప్రభాస్ బిర్యానీకి బాలీవుడ్ భామ ఫిదా..

‘ఆది పురుష్’ లో సైఫ్ అలీ ఖాన్‌తో నటిస్తున్న డార్లింగ్ ప్రభాస్ పంపిన బిర్యానీ అదిరిపోయిందంటూ కామెంట్ చేసింది కరీనా కపూర్..

Prabhas : ప్రభాస్ బిర్యానీకి బాలీవుడ్ భామ ఫిదా..

Kareena Kapoor

Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్ మాంచి ఫుడ్ లవర్ అనే విషయం తెలిసిందే. రాజమౌళి నుంచి లారెన్స్ వరకు పలువురు సినీ ప్రముఖులు ప్రభాస్ ఫుడ్ పెట్టి చంపేస్తాడంటూ వేదికల మీద చెప్పారు. అందులోనూ నాన్ వెజ్ అంటే డార్లింగ్‌కి మహా ఇష్టం. ఇటీవల ‘శ్రీదేవి సోడా సెంటర్’ సినిమా గురించి యంగ్ హీరో సుధీర్ బాబు, ప్రభాస్ ఇంటికి వెళ్తే అదిరిపోయే ఫుడ్ పెట్టాడట.

Prabhas : ప్రభాస్ వ్యానిటీ వ్యాన్ చూశారా..

ఇక రీసెంట్‌గా బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఫ్యామిలీకి బిర్యానీ పార్శిల్ పంపాడు ప్రభాస్. ‘బాహుబలి’ బిర్యానీ పంపాడంటే అద్భుతంగా ఉంటుంది అంటూ కరీనా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేసింది.

Kangana Ranaut : పూరి – ప్రభాస్ ఒక్క ఛాన్స్ ప్లీజ్..!

కరీనా కూడా ఫుడ్ లవర్ కావడంతో ఎంచక్కా బిర్యానీ లాగించేసి ప్రభాస్‌‌కి థ్యాంక్స్ చెప్పింది. ‘ఆదిపురుష్’ లో ప్రభాస్ – సైఫ్ అలీ ఖాన్ కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక కరీనా, ఆమిర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’ లో నటించింది. ఈ సినిమా క్రిస్మస్ కానుకగా రిలీజ్ కానుంది.

Prabhas Biryani