Prabhas : స్పెషల్ వీడియోతో మంత్రి కేటీఆర్‌కు ప్రభాస్ థాంక్స్..

రెబల్ స్టార్ ప్రభాస్ వరుస షూటింగ్ లతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. షూటింగ్ లతో అసలు బయట కనిపించని ప్రభాస్.. తాజాగా ఒక థాంక్యూ వీడియోతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు థాంక్స్ చెబుతూ ప్రభాస్ ఒక వీడియో రిలీజ్ చేశాడు. అసలు ప్రభాస్ కేటీఆర్‌కి ఎందుకు థాంక్యూ చెప్పాడు అని ఆలోచిస్తున్నారా?

Prabhas : స్పెషల్ వీడియోతో మంత్రి కేటీఆర్‌కు ప్రభాస్ థాంక్స్..

prabhas ktr

Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ వరుస షూటింగ్ లతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. షూటింగ్ లతో అసలు బయట కనిపించని ప్రభాస్.. తాజాగా ఒక థాంక్యూ వీడియోతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు థాంక్స్ చెబుతూ ప్రభాస్ ఒక వీడియో రిలీజ్ చేశాడు. అసలు ప్రభాస్ కేటీఆర్‌కి ఎందుకు థాంక్యూ చెప్పాడు అని ఆలోచిస్తున్నారా? అసలు విషయం ఏంటంటే.. వచ్చే నెల హైదరాబాద్ లో ‘ఫార్ములా ఈ రేస్’ జరుగుతున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ గ్లోబల్ ఈవెంట్ ని హైదరాబాద్ వేదికగా నిర్వహిస్తున్నందుకు ప్రభాస్, కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేశాడు.

Mahesh – Prabhas : ట్విట్టర్‌లో ‘#orey’ గొడవ ఏంటి.. ఆ గొడవతో మహేష్-ప్రభాస్‌కి సంబంధం ఏంటి?

ఫార్ములా ఈ రేస్ హైదరాబాద్ లో జరుగుతుండడం చాలా గర్వంగా ఉంది. దీని కోసం కృషి చేసిన మంత్రి కేటీఆర్‌, తెలంగాణ ప్రభుత్వం, గ్రీన్ కో కంపెనీ సిఈవో అనిల్ చలం శెట్టికి ప్రభాస్ థాంక్యూ చెబుతూ అభినందించాడు. ఈ ఈవెంట్ ని చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహిచాలి అంటూ తన ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఒక వీడియోని తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. కాగా ఈ ఈవెంట్ ఫిబ్రవరి 11న జరగనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన టికెట్ లను బుక్ మై షో ద్వారా కొనుగోలు చేసుకోవచ్చు. మొత్తం నాలుగు కేటగిరీలో ఈ టికెట్స్ అమ్ముతున్నారు. ఈ కేటగిరీలో టికెట్ ధరలు వచ్చి.. రూ.1000, రూ.3500, రూ.6000, రూ.10000 గా ఉన్నాయి.

ఇది ఇలా ఉంటే ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. ఇటీవల ఈ షూటింగ్ కి సంబంధించిన ప్రభాస్ ఫోటోలు లీక్ అయ్యి నెట్టింట వైరల్ అయ్యాయి. కాగా నేడు ఈ మూవీలో నటిస్తున్న శృతిహాసన్ పుట్టినరోజు కావడంతో.. ఆమెకు సంబంధించిన అప్డేట్ ఏమన్నా ఇస్తారు అనుకున్నారు అభిమానులు. కానీ మూవీ టీం ఎటువంటి అప్డేట్ ఇవ్వకుండా శృతిహాసన్ కి బర్త్ డే విషెస్ తెలియజేశారు.

 

View this post on Instagram

 

A post shared by Prabhas (@actorprabhas)