Salaar: ‘సలార్’లో ప్రభాస్ డబుల్ సర్‌ప్రైజ్..?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రాల్లో కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ‘సలార్’ మూవీపై ఎలాంటి క్రేజ్ నెలకొందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.....

Salaar: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రాల్లో కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ‘సలార్’ మూవీపై ఎలాంటి క్రేజ్ నెలకొందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మరోసారి ప్రభాస్ సునామీ సృష్టించడం ఖాయమని ఆయన అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇప్పటికే కేజీయఫ్ చిత్రాలతో తన సత్తా ఏమిటో యావత్ ప్రపంచానికి చూపించాడు. ఇప్పుడు ప్రభాస్ లాంటి ఇంటర్నేషనల్ స్టార్‌తో ఈ డైరెక్టర్ చేతులు కలపడంతో ఈ కాంబినేషన్‌లో ఎలాంటి సినిమా వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Salaar: డేట్ ఫిక్స్ చేసుకున్న సలార్..?
అయితే ఇప్పటికే పలు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తి చేసుకున్న ‘సలార్’ను ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా రానుందని ఈ చిత్ర పోస్టర్స్ చూస్తే అర్థమవుతోంది. కాగా, తాజాగా.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో షికారు చేస్తోంది. సలార్ చిత్రంలో ప్రభాస్ లుక్ చాలా రఫ్‌గా ఊరమాస్ అవతారంలో మనకు కనిపించాడు. కానీ, తాజాగా ఆదిపురుష్ చిత్ర దర్శకుడు ఓం రావుత్ ఏర్పాటుచేసిన ఓ చిన్న పార్టీకి హాజరైన ప్రభాస్, చాలా స్లిమ్‌గా మారి అందరికీ షాకిచ్చాడు. ఇప్పుడు ఇదే లుక్‌ను సలార్ సినిమాకు ముడిపెడుతున్నారు నెటిజన్లు.
Salaar: పూర్తి యాక్షన్ మోడ్‌లోకి వెళ్లిన సలార్
సలార్ చిత్రంలో ప్రభాస్ రెండు విభిన్న లుక్స్‌లో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయనున్నాడని, అందుకే ఆయన ఈ విధంగా ఉన్నట్టుండి సన్నబడ్డాడంటూ పలు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ.. సలార్ చిత్రంలో నిజంగా ప్రభాస్ రెండు డిఫరెంట్ లుక్స్‌లో కనిపిస్తే మాత్రం ఆ సినిమా మరో లెవెల్‌లో ఉంటుందని చిత్ర వర్గాలు అంటున్నాయి. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన అందాల భామ శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఈ సినిమాను హొంబాలే ఫిలింస్ అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తోంది. మరి ఈ సినిమాలో నిజంగానే ప్రభాస్ రెండు డిఫరెంట్ లుక్స్‌లో ఆడియెన్స్‌ను సర్‌ప్రైజ్ చేస్తాడా అనేది తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.
- Tollywood Heros : టాలీవుడ్ హీరోలని టార్గెట్ చేసిన బాలీవుడ్ ఆడియన్స్.. ట్రోల్స్ తో హడావిడి..
- Salaar: సలార్‌లో రాకింగ్ సర్‌ప్రైజ్.. ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్!
- Eeswar Movie : ప్రభాస్ 20 ఏళ్ళు.. ప్రభాస్ గురించి కృష్ణంరాజు వ్యాఖ్యలు..
- Director Maruthi : అటు ప్రభాస్.. ఇటు చిరంజీవి.. మధ్యలో మారుతి..
- Prabhas : ప్రాజెక్ట్ K కోసం తరలి వచ్చిన స్టార్లు.. ట్రెండ్ అవుతున్న ఫొటో..
1Murmu, Yashwant Sinha : రాష్ట్రపతి ఎన్నికల బరిలో యశ్వంత్ సిన్హా, ద్రౌపదీ ముర్ము ఫైనల్
2BJP: ఉప రాష్ట్రపతి ఎన్నిక.. బీజేపీకే మెజారిటీ
3Bangaru Bonam : విజయవాడ దుర్గమ్మకు తెలంగాణ బంగారు బోనం
4Umesh Murder : ఉమేశ్ హత్య కేసులో ఏడుగురు అరెస్ట్
5Maharashtra: ‘మహా’ అసెంబ్లీలో నేడే బల పరీక్ష
6Nupur Sharma : నుపుర్ శర్మపై లుక్ అవుట్ సర్క్యులర్
7Jasprit Bumrah: బ్రియాన్ లారా వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసిన బుమ్రా
8BJP Sabha : నేడు బీజేపీ విజయ సంకల్ప సభ..పరేడ్ గ్రౌండ్లో సర్వం సిద్ధం
9Metro Trains : నేడు సాధారణంగానే మెట్రో రైళ్లు నడుస్తాయి : ఎండీ ఎన్వీఎస్ రెడ్డి
10Punjab Man: డ్రగ్స్ తీసుకోకుండా అడ్డుకోవడానికి కొడుకును చైన్లతో కట్టేసిన తల్లి
-
UP CM Yogi : పాతబస్తీ భాగ్యలక్ష్మిఅమ్మవారిని దర్శించుకోనున్న యూపీ సీఎం యోగి..చార్మినార్ వద్ద భారీ బందోబస్తు
-
Viral Video : ఆలయంలో అద్భుతం.. శివలింగంపై మంచు.. మహాశివుని మహిమే.. వీడియో!
-
TRS BJP Flexi War : మెట్రో పిల్లర్లకు ఉన్న సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలపై ప్రధాని మోదీ బ్యానర్లు
-
Diabetics Control : షుగర్ తగ్గాలంటే.. ఇవి తినాల్సిందే..!
-
Metro Trains : రేపు సాధారణంగానే మెట్రో రైళ్లు నడుస్తాయి : ఎండీ ఎన్వీఎస్ రెడ్డి
-
Bumrah World Record : టెస్ట్ క్రికెట్ లో బుమ్రా వరల్డ్ రికార్డు
-
Massive Earthquake : దక్షిణ ఇరాన్లో భారీ భూకంపం.. యూఏఈలోనూ ప్రకంపనలు!
-
Pawan Kalyan : కులాలను విడగొట్టడం కాదు..కలిపే విధానం ఉండాలి : పవన్ కళ్యాణ్