Unstoppable 2: అన్‌స్టాపబుల్‌లో పాన్ ఇండియా స్టార్.. నెక్ట్స్ లెవెల్ అంటోన్న ఫ్యాన్స్

నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా చేస్తున్న అన్‌స్టాపబుల్ టాక్ షో రెండో సీజన్ ప్రస్తుతం ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తూ దూసుకుపోతుంది. ఇప్పటికే 4 ఎపిసోడ్‌లు పూర్తవగా, తాజాగా 5వ ఎపిసోడ్‌ను స్ట్రీమింగ్ చేయనున్నారు.

Unstoppable 2: అన్‌స్టాపబుల్‌లో పాన్ ఇండియా స్టార్.. నెక్ట్స్ లెవెల్ అంటోన్న ఫ్యాన్స్

Prabhas To Grace Balakrishna Unstoppable 2

Unstoppable 2: నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా చేస్తున్న అన్‌స్టాపబుల్ టాక్ షో రెండో సీజన్ ప్రస్తుతం ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తూ దూసుకుపోతుంది. ఇప్పటికే 4 ఎపిసోడ్‌లు పూర్తవగా, తాజాగా 5వ ఎపిసోడ్‌ను స్ట్రీమింగ్ చేయనున్నారు. ఇక ఈ రెండో సీజన్‌ను ప్రత్యేకంగా ఉండేలా ప్రతి ఎపిసోడ్‌లోనూ ఇద్దరు లేదా ముగ్గురు గెస్టులుగా వస్తూ బాలయ్యతో రచ్చ చేస్తున్నారు.

Unstoppable episode 5 : అన్‌స్టాపబుల్ వేదికపై తారక రాముడి శతజయంతి వేడుకలు..

తాజాగా అన్‌స్టాపబుల్ 5వ ఎపిసోడ్‌లో టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్ అల్లు అరవింద్, సురేష్ బాబులతో పాటు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కూడా గెస్టులుగా వస్తున్నారు. ఇక వారితో బాలయ్య పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలో అల్లు అరవింద్, సురేష్ బాబులతో బాలయ్య సరదా కాన్వర్జేషన్ ఎలా ఉండబోతుందో ఇప్పటికే ప్రోమోలో చూపెట్టారు. అయితే ఇప్పుడు అన్‌స్టాపబుల్-2కు సంబంధించి ఓ క్రేజీ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. త్వరలోనే అన్‌స్టాపబుల్-2 షోలో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ అడుగుపెట్టనున్నాడట.

Unstoppable 2: బాలయ్య టాక్ షోకు మరో ఇద్దరు యంగ్ హీరోలు.. ఇక సందడే సందడి!

ప్రభాస్ తన స్నేహితుడు, మ్యాచో స్టార్ గోపీచంద్‌తో కలిసి ఈ షోలో పాల్గొనబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన షూటింగ్ డిసెంబర్ 11న జరగనుందట. ఈ వార్తతో బాలయ్య ఫ్యాన్స్‌తో పాటు ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఈ ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అప్పుడే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ వార్తపై షో నిర్వాహకులు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేయకపోవడం గమనార్హం. మరి నిజంగానే బాలయ్య షోలో పాన్ ఇండియా స్టార్ ఎంట్రీ ఇస్తాడా.. ఒకవేళ ఆయన నిజంగానే వస్తే, ఈ సీజన్ మొత్తానికే అది హైలైట్ ఎపిసోడ్ కావడం గ్యారెంటీ అని అభిమానులు అంటున్నారు.