Prabhas-Trivikram: మరో క్రేజీ కాంబినేషన్.. అభిమానులకు పండగే!

టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీ ఏదైనా కొన్ని కాంబినేషన్లు చాలా కొత్తగా, గమ్మత్తుగా ఉంటాయి.. ప్రాజెక్టు వస్తుందంటేనే భలే క్రేజీగా ఉంటాయి. అందుకే అభిమానులే కాదు.. ఆయా కాంబినేషన్లో సినిమాలు రావాలని ప్రేక్షకులు కూడా కోరుకుంటారు. అలాంటి క్రేజీ కాంబినేషన్లో ఒకటి త్రివిక్రమ్-ప్రభాస్ కాంబినేషన్ ఒకటి. మహేష్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ వంటి టాప్ హీరోలతో సినిమాలు చేసిన త్రివిక్రమ్ ఇప్పటి వరకు ప్రభాస్ తో ఒక్క సినిమా కూడా చేయలేదు.

Prabhas-Trivikram: మరో క్రేజీ కాంబినేషన్.. అభిమానులకు పండగే!

Prabhas Trivikram

Prabhas-Trivikram: టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీ ఏదైనా కొన్ని కాంబినేషన్లు చాలా కొత్తగా, గమ్మత్తుగా ఉంటాయి.. ప్రాజెక్టు వస్తుందంటేనే భలే క్రేజీగా ఉంటాయి. అందుకే అభిమానులే కాదు.. ఆయా కాంబినేషన్లో సినిమాలు రావాలని ప్రేక్షకులు కూడా కోరుకుంటారు. అలాంటి క్రేజీ కాంబినేషన్లో ఒకటి త్రివిక్రమ్-ప్రభాస్ కాంబినేషన్ ఒకటి. మహేష్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ వంటి టాప్ హీరోలతో సినిమాలు చేసిన త్రివిక్రమ్ ఇప్పటి వరకు ప్రభాస్ తో ఒక్క సినిమా కూడా చేయలేదు. పలుమార్లు ఈ కాంబినేషన్ లో సినిమా వస్తుందని ఊహాహనాలు వచ్చినా అది పట్టాలెక్కలేదు.

కానీ, ఈలోగా ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో అరడజను సినిమాలు ఉన్నాయి. ముందుగా పాన్ ఇండియా దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ సినిమాను తెరమీదకి తెచ్చే ప్రయత్నాల్లో ఉన్న ప్రభాస్.. మరోవైపు ఓంరౌత్ దర్శకత్వం తెరకెక్కుతున్న బాలీవుడ్ డెబ్యూ హిస్టారికల్ ఫిల్మ్ ఆదిపురుష్ ను కూడా లైన్లో పెట్టేశాడు. ప్రస్తుతం ఈ రెండు సినిమాలతో బిజీబిజీగా ఉన్న ప్రభాస్ కోసం మరో రెండు, మూడు ప్రాజెక్టులు సిద్ధమవుతున్నాయి.

అయితే.. ఇప్పుడు త్రివిక్రమ్-ప్రభాస్ క్రేజీ కాంబినేషన్ లో మరో ప్రాజెక్టుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. హారికా-హాసిని బ్యానర్, నిర్మాత చినబాబు ఈ ప్రయత్నాల్లో ఉన్నారట. త్రివిక్రమ్ తో హారికా వారికి మంచి ర్యాపొ ఉన్న సంగతి తెలిసిందే. కాగా.. ప్రభాస్ తో కూడా మంచి సంబంధాలే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ కాంబినేషన్ సెట్ అయ్యే అవకాశాలున్నాయని తెలుస్తుంది. ప్రస్తుతం త్రివిక్రమ్ మహేష్ తో సినిమా సన్నాహాల్లో ఉన్నారు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ తో సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. అయితే.. ప్రస్తుతానికి చర్చలలో ఉన్న ఈ ప్రాజెక్టుపై ప్రభాస్ ఎలా స్పందిస్తాడన్నది ఆసక్తిగా మారింది.