Prabhas : ప్రభాస్ వ్యానిటీ వ్యాన్ చూశారా..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన రేంజ్‌కి తగిన వెహికల్‌తో మరోసారి హాట్ టాపిక్ అయ్యారు..

10TV Telugu News

Prabhas: టాలీవుడ్ స్టార్ హీరోలు తమ యాక్టింగ్‌తోనే కాదు.. వెహికల్స్‌తో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అవుతున్నారు. ఆల్రెడీ రకరకాల టాప్ బ్రాండెడ్ కార్లు ఉన్నా కూడా ఇంకా కొత్తవి కొంటూ ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతున్నారు. లేటెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన రేంజ్‌కి తగిన వెహికల్‌తో మరోసారి హాట్ టాపిక్ అయ్యారు.

Ram Charan New Car : మెగా పవర్‌స్టార్.. కొత్త కార్ చూశారా..!

తెలుగు హీరోలు రేంజ్ మారిపోయింది. పాన్ ఇండియా లెవల్‌కి అప్‌‌గ్రేడ్ అవ్వడంతో పాటు టాలీవుడ్ మీద ఫోకస్ పెరగడంతో ట్రెండ్‌కి ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతున్నారు. స్పెషల్లీ వెహికల్స్ విషయంలో ఈ రూల్ మస్ట్‌గా ఫాలో అవుతున్నారు హీరోలు. లేటెస్ట్‌గా టాప్ హీరో ప్రభాస్ తన రేంజ్‌కి తగిన వ్యానిటీ వ్యాన్‌ని కస్టమైజ్డ్‌గా డిజైన్చే యించుకున్నారు. స్పేషియస్‌గా అల్ట్రా పాష్‌గా ఉన్న వ్యానిటీ వ్యాన్‌లో రూఫ్ టాప్ స్పెషల్ ఎట్రాక్షన్. ప్రజెంట్ ప్రభాస్ ముంబైలో ‘ఆదిపురుష్’ షూటింగ్ చేస్తున్నారు. ఈ షూట్ గ్యాప్‌లో ప్రభాస్ వ్యానిటీ వ్యాన్‌లో ఉన్నానంటూ ఓమ్ రౌత్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Stars Bike Collection : ట్రెండీ బైకులపై మనసు పారేసుకుంటున్న స్టార్స్..

ప్రభాస్ అల్ట్రా పాష్ వ్యానిటీ వ్యాన్‌ని తీసుకుంటే.. మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ మెర్సెడెజ్ బెంజ్ బ్రాండ్‌లో జిఎల్ ఎస్ 600 కార్‌ని కొన్నారు. ఈ కార్‌లో చాలా ఫీచర్స్ తనకు నచ్చినట్టు కస్టమైజ్డ్‌గా డిజైన్ చేయించుకున్నారు రామ్ చరణ్. 3 కోట్లతో ఇష్టపడి కొనుక్కున్న కార్‌ని చూసి తెగ ముచ్చట పడిపోతున్నారు చెర్రీ.

Filmy Facts : బాహుబలి2లో ప్రభాస్ డ్యామ్ ఎందుకు పగలకొట్టాడో తెలుసా..?

వీళ్లందరికన్నా ముందే అందరి కంటే అడ్వాన్డ్‌గా ఉంటూ వరల్డ్స్ మోస్ట్ ఎక్స్ పెన్సివ్ లంబోర్గినీ సిరీస్‌లో ఉరుస్ గ్రాఫైట్ క్యాప్సూల్ కార్‌ని సొంతం చేసుకుని రికార్డ్ క్రియేట్ చేశారు ఎన్టీఆర్. మెటాలిక్ బ్లాక్ కలర్‌తో మెరిసి పోతున్న ఈ కార్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అంతేకాదు ఇండియాలోనే ఫస్ట్ లంబోర్గినీ ఉరుస్ గ్రాఫైట్ కారు కొన్న హీరోగా హైలెట్ అయ్యారు ఎన్టీఆర్.