Prabhas : తిరుమలలో ప్రభాస్.. పంచెకట్టుతో ఎలా ఉన్నాడో చూడండి..

నేడు ఉదయం ప్రభాస్, చిత్రయూనిట్ తిరుమలలో వేంకటేశ్వరస్వామిని దర్శించుకొని, సుప్రభాత సేవలో పాల్గొన్నారు.

Prabhas : తిరుమలలో ప్రభాస్.. పంచెకట్టుతో ఎలా ఉన్నాడో చూడండి..

Prabhas Visited Tirumala Venkateswaraswami Temple early morning participated in suprabhatha seva

Tirumala : ప్రభాస్ (Prabhas) రాముడిగా, కృతి సనన్ (Kriti Sanon) సీతగా, సైఫ్ అలీఖాన్ (Saif Alikhan) రావణాసురుడిగా ఓం రౌత్ (Om Raut) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆదిపురుష్ సినిమా జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజయిన ట్రైలర్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ రావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక నేడు జూన్ 6న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని తిరుపతి (Tirupati) శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో భారీగా నిర్వహించబోతున్నారు.

ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చినజీయర్ స్వామి ముఖ్య అతిథిగా రాబోతున్నారు. తిరుపతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అంతా సిద్ధం చేశారు. అభిమానులు, ప్రేక్షకులు ఈ ఈవెంట్ కు భారీగా తరలిరానున్నారు. ఇక చిత్రయూనిట్ అంతా తిరుపతికి చేరుకున్నారు.

Adipurush : తిరుపతిలో భారీగా నేడే ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎన్ని స్పెషల్స్ ఉన్నాయో తెలుసా?

నేడు ఉదయం ప్రభాస్, చిత్రయూనిట్ తిరుమలలో వేంకటేశ్వరస్వామిని దర్శించుకొని, సుప్రభాత సేవలో పాల్గొన్నారు. ప్రభాస్ తిరుమలలో ఆలయం వద్ద నడిచి వెళ్తున్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తిరుమలలో ప్రభాస్ వైట్ షర్ట్ వేసి పంచెకట్టు కట్టుకొని సాంప్రదాయంగా కనిపించారు. దీంతో ప్రభాస్ పంచెకట్టుతో భలే ఉన్నాడే అంటూ అభిమానులు, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రభాస్ తో ఫోటోలు దిగడానికి, ప్రభాస్ ని తమ కెమెరాల్లో బంధించడనైకి అక్కడున్న భక్తులు అంతా గుమిగూడారు. దీంతో తిరుమల నుంచి ప్రభాస్ ఫోటోలు ఇంకా వస్తాయేమో అని ఎదురు చూస్తున్నారు అభిమానులు.