‘దేవి2’ అఫీషియ‌ల్ టీజ‌ర్ విడుదల

  • Published By: veegamteam ,Published On : March 27, 2019 / 06:42 AM IST
‘దేవి2’ అఫీషియ‌ల్ టీజ‌ర్ విడుదల

తమన్నా, ప్రభుదేవా కలిసి నటించిన తమిళ హారర్ చిత్రం ‘దేవి’ తెలుగులో ‘అభినేత్రి’ 2016 లో బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాధించింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా ‘దేవి 2’ ను రూపొందిస్తున్నారు. ప్రభుదేవా.. తమన్నాలతో పాటుగా నందిత శ్వేత కూడా ఈ సీక్వెల్ లో మరో కీలక పాత్రలో నటిస్తోంది. మరి ఈ సినిమాను తెలుగులో ‘అభినేత్రి 2’ గా రిలీజ్ చేస్తారా లేదా అనేది వేచి చూడాలి.
Read Also : ‘మహర్షి’ మ్యూజికల్ జర్నీ

ఈ సినిమాకు సంగీత దర్శకుడు సామ్ సిఎస్ఐషారీ కే గ‌ణేష్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజ‌ర్ విడుద‌లైంది. ఇందులోని స‌న్నివేశాలు ఆస‌క్తిక‌రంగా ఉన్నాయి. ప్ర‌భుదేవా, త‌మ‌న్నాలు ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదాన్ని అందించ‌నున్నార‌ని చెబుతున్నారు. కోవై స‌ర‌ళ‌, ఆర్‌జే బాలాజీ, నందిత చిత్రంలో ముఖ్య పాత్ర‌లు చేయ‌నున్నారు. మ‌రో వైపు ప్ర‌భుదేవా తొలిసారి ఫ్యామిలీ అండ్ యాక్ష‌న్ ఫ్లిక్‌లో పోలీస్ పాత్ర చేయ‌బోతున్నాడు. ఏసీ ముగ్లీ ద‌ర్శ‌క‌త్వంలో ఈ మూవీ తెర‌కెక్క‌నుంది.