Pragya Jaiswal: ప్రగ్యాను చుట్టేసిన యాచకులు.. వీడియో వైరల్!

పోకిరి సినిమాలో బ్రహ్మానందం కామెడీని ఎవరూ మర్చిపోలేరు. పగబట్టిన యాచకులంతా కలిసి బ్రహ్మితో ఓ ఆటాడేసుకుంటారు. యాచకులు బాధ పడలేక పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. చేస్తే దానం చెయ్ లేదంటే మానుకో కానీ ఇలా మా టైమ్ వెస్ట్ చేయొద్దని పోలీసులు వార్నింగ్ కూడా ఇస్తారు.

Pragya Jaiswal: ప్రగ్యాను చుట్టేసిన యాచకులు.. వీడియో వైరల్!

Pragya Jaiswal

Pragya Jaiswal: పోకిరి సినిమాలో బ్రహ్మానందం కామెడీని ఎవరూ మర్చిపోలేరు. పగబట్టిన యాచకులంతా కలిసి బ్రహ్మితో ఓ ఆటాడేసుకుంటారు. యాచకులు బాధ పడలేక పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. చేస్తే దానం చెయ్ లేదంటే మానుకో కానీ ఇలా మా టైమ్ వెస్ట్ చేయొద్దని పోలీసులు వార్నింగ్ కూడా ఇస్తారు. దీంతో చేసేదేం లేక బ్రహ్మానందం దిగొచ్చి యాచకులు డిమాండ్స్ నెరవేరుస్తారు. అచ్చంగా ఇప్పుడు హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ కు అలాంటి పరిస్థితే కనిపించింది.

ప్రగ్యా తాజాగా సెలబ్రిటీ హెయిర్‌స్టైలిష్ట్‌ హకీం అలీమ్‌ సెలూన్‌ కు వెళ్లి తిరిగి బయటకి రాగానే ప్రగ్యాని చూసిన కొంతమంది యాచకులు వెంటనే ఆమెను చుట్టుముట్టారు. ఆకలిగా ఉంది మేడం దానం చేయండని వెంటపడ్డారు. అందరూ ఒక్కసారిగా చుట్టముట్టడంతో షాక్‌కు గురైన ప్రగ్యా అక్కడి నుంచి బయటపడేందుకు ప్రయత్నించినా వారు వెంటపడుతూనే ఉన్నారు. దీంతో ప్రగ్యా తనని ముందుగా కారు ఎక్కనిస్తేనే డబ్బు ఇస్తానని చెప్పడంతో వాళ్ళు పక్కకి తప్పుకున్నారు.

అప్పుడు కార్ ఎక్కిన ప్రగ్యా తన బ్యాగ్‌లో నుంచి కొంత డబ్బు తీసి వాళ్ల చేతికందించి కదిలేందుకు ప్రయత్నించారు. కానీ, యాచకులు మాత్రం ఆమె కారుని పట్టుకుని దాని వెంటే పరిగెడుతూ ఇంకా డబ్బు కావాలని బ్రతిమాలారు. దీంతో ప్రగ్యా ఇంకొంత డబ్బు వాళ్లకి అందించి అక్కడ నుండి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారి సామజిక మాధ్యమాలలో తెగ చక్కర్లు కొడుతోంది. కాగా ప్రగ్యా ప్రస్తుతం బాలయ్య సరసన ‘అఖండ’ సినిమాలో నటిస్తుంది.