Prakash Raj: మంచు విష్ణుపై “మా” అధికారికి ఫిర్యాదు.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రకాష్ రాజ్!

మంచు విష్ణుపై "మా" ఎన్నికల అధికారికి ప్రకాష్ రాజ్ ఫిర్యాదు చేశారు.

10TV Telugu News

Prakash Raj: మంచు విష్ణుపై “మా” ఎన్నికల అధికారికి ప్రకాష్ రాజ్ ఫిర్యాదు చేశారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లను తమకు అనుకూలంగా వేయించుకునేందుకు మంచు విష్ణు ప్యానెల్ ప్రయత్నిస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు ప్రకాష్ రాజ్.

వైజాగ్, చెన్నైల్లో ఉండేవారి పేర్లు చేర్చి ఇక్కడ డబ్బులు కట్టారని, వారితో ఓటు వేయించుకునే కుట్ర చేస్తున్నారని ప్రకాశ్ రాజ్ ఫిర్యాదు చేశారు.

మా ఎన్నకల్లో 60ఏళ్లు పైబడినవారే పోస్టల్ బ్యాలెట్‌కు అర్హులు అని, వైజాగ్, చెన్నైల్లో ఉండేవారి పేర్లు చేర్చి డబ్బులు కట్టారని ఆరోపించారు.

మోహన్ బాబు కంపెనీలో మేనేజర్ 56మందికి సంబంధించి రూ. 28వేలు మోహన్ బాబు ఎలా కడుతారని ప్రశ్నించారు. ఎన్నికలు జరుగుతున్న తీరుపై ప్రకాష్ రాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రెస్ మీట్‌లో కన్నీరు పెట్టుకున్నారు.

 

×