Prakash Raj: జేసీబీ గిఫ్ట్.. పేదకుటుంబానికి అండగా విలక్షణ నటుడు!

దేశంలో కరోనా మహమ్మారి ప్రభావంతో ఎంతో మంది ఉపాధి కోల్పోయి నిరుద్యోగులుగా మారిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా వైరస్ వ్యాప్తి కాకుండా విధించిన లాక్ డౌన్ ఎన్నో కుటుంబాలు రోడ్డున పడేశాయి.

10TV Telugu News

Prakash Raj: దేశంలో కరోనా మహమ్మారి ప్రభావంతో ఎంతో మంది ఉపాధి కోల్పోయి నిరుద్యోగులుగా మారిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా వైరస్ వ్యాప్తి కాకుండా విధించిన లాక్ డౌన్ ఎన్నో కుటుంబాలు రోడ్డున పడేశాయి. ఇలాంటి సమయంలో కొంత మంది మానవత్వం చాటుకొని ఎంతో మంది పేద ప్రజలకు బాసటగా నిలుస్తున్నారు. వీరిలో నటుడు సోనూ సూద్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. సోనూ సూద్ బాటలోనే కొంద మంది నటీ, నటులు తమ సేవ కొనసాగిస్తున్నారు.

Bhanu Shree: సంప్రదాయంగా సెగలు రేపుతున్న భానుశ్రీ సోకులు!

టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు వివిధ పాత్రలతో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న ప్రకాశ్ రాజ్ నేను సైతం అంటూ కరోనా కష్ట కాలంలో పేదలకు అండగా నిలిచారు. తాజాగా ప్రకాశ్ రాజ్ ఓ పేద కుటుంబానికి అండగా నిలిచి వారి జీవితాల్లో వెలుగులు నింపారు. కర్ణాటకలోని మైసూరు సమీపంలో ఉన్న శ్రీరంగపట్నంలో ఓ కుటుంబం కరోనా కష్టకాలంలో దుర్భరజీవితాన్ని గడుపుతున్నారు. వారి పరిస్థితి తెలుసుకున్న ప్రకాశ్ రాజ్ తాను స్థాపించిన ‘ప్రకాశ్ రాజ్ ఫౌండేషన్’ తరపున సాయం అందించారు.

Ileana D’Cruz: గోవా అందమంతా రంగరించిన ఇల్లీ బేబీ!

ఉపాధి లేక కష్టాల్లో ఉన్న ఆ కుటుంబానికి ప్రకాష్ రాజ్ జేసీబీ అందించి ఆ కుటుంబ కష్టాన్ని తీర్చేశారు. ఒకరి జీవితంలో వెలుగును నింపేందుకు.. మనం సంపాదించింది తిరిగి ఇస్తుంటే ఎంతో ఆనందంగా ఉంటుందంటూ ప్రకాష్ రాజ్ జేసీబీ అందించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. ప్రకాష్ రాజ్ ఆ కుటుంబంతో దిగిన ఫోటోలు వైరల్ అవుతుండగా.. ఆ కుటుంబంలోని మనుషుల ముఖాలలో ఆనందాన్ని ఎన్నికోట్లు ఇచ్చినా పొందలేరని నెటిజన్లు పొగుడుతున్నారు.

10TV Telugu News