Prakash Raj: ‘మా’లోనే ఉంటా.. రాజీనామా నిర్ణయం వెనక్కి తీసుకుంటా.. ఒక్క కండీషన్! -ప్రకాష్ రాజ్

'మా' ఎన్నిక‌ల స‌మ‌రం ముగిసినా.. మాటల సమరం మాత్రం ముగియలేదు.

Prakash Raj: ‘మా’లోనే ఉంటా.. రాజీనామా నిర్ణయం వెనక్కి తీసుకుంటా.. ఒక్క కండీషన్! -ప్రకాష్ రాజ్

Prakash Raj (1)

Prakash Raj: ‘మా’ ఎన్నిక‌ల స‌మ‌రం ముగిసినా.. మాటల సమరం మాత్రం ముగియలేదు. ఎన్నికల్లో మంచు విష్ణు గెలిచి ‘మా’ అధ్య‌క్షుడిగా మారాక అంతా స‌ద్దుమ‌ణిగినట్టేన‌ని అనుకున్నారు. కానీ, వెంటనే రాజీనామాల పర్వం తెరపైకి వచ్చింది. ఈ క్రమంలోనే ప్ర‌కాశ్‌రాజ్ త‌న ప్యానెల్‌లో గెలిచిన స‌భ్యులతో రాజీనామా చేయించారు. త‌న‌తో క‌లిసి వ‌చ్చే వారితో మూకుమ్మ‌డిగా రాజీనామా చేయించిన ప్రకాష్ రాజ్.. ఈ సంధర్భంగా కీలక నిర్ణయాన్ని ప్రకటించారు.

‘మా’ అసోసియేషన్‌లోనే ఉంటానని, రాజీనామా నిర్ణయం వెనక్కి తీసుకుంటానని, అయితే, ఒక్క కండీషన్ అన్నారు ప్రకాష్ రాజ్. తెలుగు వాడే మా ఎన్నికల్లో పోటీ చెయ్యాలని, అధ్యక్షునిగా కావాలని బైలాస్ మార్చకుంటే, నా రాజీనామాను వెనక్కి తీసుకుంటానని అన్నారు ప్రకాష్ రాజ్.

ఈ సంధర్భంగా హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. అందరం కలిసి పనిచేయలేమని డిసైడ్ అయ్యాము. లాస్ట్ టైమ్ ఏం జరిగిందో చూశాం.. విష్ణు నాకు తమ్ముడు లాంటివాడే కానీ, నరేష్ ‘మా’ అసోసియేషన్‌ను వెనుక నుంచి నడిపిస్తారు. గొడవలు వద్దనే చివరకు ఈ నిర్ణయం తీసుకున్నాము. ‘మా’కు మంచి జరగాలనే ఈ నిర్ణయం. మాకు ఓట్లేసిన వారు క్షమించాలి అన్నారు శ్రీకాంత్.