1997 Movie : డాక్టర్ మోహన్ లుక్ రిలీజ్ చేసిన ప్రకాష్ రాజ్..

1997 మూవీ నుంచి హీరో, డైరెక్టర్ మోహన్ లుక్‌ను ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ విడుదల చేశారు..

1997 Movie : డాక్టర్ మోహన్ లుక్ రిలీజ్ చేసిన ప్రకాష్ రాజ్..

1997

1997 Movie: డా.మోహన్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, కోటి ప్రధాన పాత్రల్లో, డా.మోహన్ స్వీయదర్శకత్వంలో ఈశ్వర పార్వతి మూవీస్ బ్యానర్ మీద, రియల్ ఇన్సిడెంట్స్‌తో తెరకెక్కిన భిన్నమైన కథా చిత్రం ‘1997’. ఈ చిత్రానికి సంబంధించిన మూడు ముఖ్య పాత్రల్లో ఒకటైన నవీన్ చంద్ర లుక్‌ని యంగ్ అండ్ క్రేజీ హీరో విశ్వక్ సేన్ విడుదల చేశారు. శ్రీకాంత్ అయ్యంగార్ లుక్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రిలీజ్ చేశారు. తాజాగా హీరో, డైరెక్టర్ మోహన్ లుక్‌ను ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ విడుదల చేశారు.

MAA Elections 2021 : ‘మా’ మధ్య విబేధాలు లేవు..

అనంతరం ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా కథ విన్నాను, సాంగ్ చూసాను. చాలా చాలా బాగున్నాయి. ఇప్పుడు యాక్టర్, డాక్టర్ మోహన్ లుక్ విడుదల చేస్తున్నాను. ఏ ఇష్యూ మీద సినిమా తీసారో తెలుసు. ‘1997’ అనేది టైటిల్ ఉండొచ్చు, కానీ ఈ రోజు కూడా మనల్ని బాధ పెడుతున్న సమస్యల గురించి చెబుతున్నారు. ‘1997’ లో జరిగినట్టు కాదు, ఈ రోజు మన కళ్లముందు జరుగుతున్నాయి. ఈ సినిమాని ప్రమోట్ చేయడానికి ఎందుకు ఒప్పుకున్నాను అంటే, సినిమా అనేది హీరో అవ్వడానికి, హీరోయిన్ అవ్వడానికి, సంపాదించడానికి కాదు, మన చుట్టూ, మన మధ్య ఉన్న సమస్యలేమిటి, దానిమీద మన అవగాహన ఏమిటి, దానిమీద మన దృష్టి ఏమిటి, దాన్ని ఎలా జనాల దగ్గరికి తీసుకెళ్లాలి, ఇలాంటి సమస్యలను చూపించేందుకు సినిమా అన్నది బిగ్ ప్లాట్ ఫాం. మోహన్ నిజంగా తన అంతకరణ శుద్ధితో ఇలాంటి సమస్యలను జనాల దగ్గరికి తీసుకెళ్లాలి, దానికి పరిష్కారం ఎలా కనుక్కోవాలి అని చేస్తున్న ప్రయత్నం. ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా. మోహన్ కమిట్‌మెంట్, డెడికేషన్‌కు ఆయనకు ఆల్ ది బెస్ట్ తెలుపుతున్నాను’’ అన్నారు.

Prakash Raj

హీరో, దర్శకుడు డా. మోహన్ మాట్లాడుతూ.. ‘‘సినిమాలో నా లుక్ విడుదల చేసిన ప్రకాష్ రాజ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. రియల్ ఇన్సిడెంట్స్‌ని బేస్ చేసుకుని, బర్నింగ్ ఇష్యూని తీసుకుని దానికి కమర్షియల్ హంగులు యాడ్ చేసి ఈ సినిమా చేశా. తప్పకుండా అందరికీ నచ్చుతుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు.

Puri Jagannadh : గోవాలో నెల రోజులు..