Movie Tickets Issue: పవన్ తర్వాత ప్రకాష్ రాజ్.. ఇది దేనికి సంకేతం?

ఏపీలో సినిమా టికెట్ల ధరల తగ్గింపు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. టికెట్ల వివాదంతో పాటు అధికారుల దాడులతో అప్పుడు చాలా థియేటర్లు స్వచ్ఛందంగానే మూసేశారు. టికెట్ల తగ్గింపు భారీ..

Movie Tickets Issue: పవన్ తర్వాత ప్రకాష్ రాజ్.. ఇది దేనికి సంకేతం?

Movie Tickets Issue

Movie Tickets Issue: ఏపీలో సినిమా టికెట్ల ధరల తగ్గింపు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. టికెట్ల వివాదంతో పాటు అధికారుల దాడులతో అప్పుడు చాలా థియేటర్లు స్వచ్ఛందంగానే మూసేశారు. టికెట్ల తగ్గింపు భారీ సినిమాల బిజినెస్ మీద తప్పకుండా పడుతుంది. ఈ నేపథ్యంలోనే సినీ పరిశ్రమ నుండి చాలామంది ప్రముఖులు ప్రభుత్వం చర్చలు జరిపినా అప్పుడు అది పరిష్కారమవలేదు. ప్రభుత్వ పెద్దలు ఈ వివాదంపై చర్చ జరుపుతున్నామని చెప్పారు కానీ అది పూర్తవలేదు.

Movie Tickets Issue: సినిమా టికెట్ల రేట్లు ఇంకా ఫైనల్ కాలేదు – మంత్రి పేర్ని నాని

ఆ తరువాత స్టార్ హీరోలంతా కలిసి సీఎం జగన్ తో మెగా మీటింగ్ కూడా జరిగింది. సమస్యకి పరిష్కారం దొరికిందని కూడా సంబరపడ్డారు. కానీ.. ఇంకా టికెట్ల ధరలపై నిర్ణయం కాలేదు. ఈలోగానే కొత్త సినిమాలు విడుదల అయిపోతున్నాయి. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటిల భీమ్లా నాయక్ సినిమా విడుదల కావడం.. ఏపీలో బెనిఫిట్ షోల రద్దు.. తగ్గినా టికెట్ ధరలతో ఇది మరోసారి రాష్ట్రవ్యాప్తంగా వివాదాస్పదమైంది. దీనికి మెగా అభిమానులు.. పవన్ కళ్యాణ్, నాగబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా అటు నుండి వైసీపీ నేతలు, మంత్రులు కౌంటర్లు ఇచ్చారు.

Bheemla Naik : ఏపీ సర్కార్‌‌పై ప్రకాశ్ రాజ్ హాట్ కామెంట్స్, బాక్సాపీస్ వద్ద కక్ష సాధింపులు ఏంటీ ?

ఈ వ్యవహారంలో.. భీమ్లా నాయక్ సినిమాకు ఏపీలో అన్యాయం జరిగిందనే అంశంలో పవన్ కళ్యాణ్ తప్ప ఇండస్ట్రీలో మరెవరూ ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే సాహసం చేయలేదు. నాగబాబు మాట్లాడినా అది పవన్ కళ్యాణ్ అన్నగా ఆయన స్పందన చూడాల్సిందే. పవన్ తర్వాత ఈ అంశంపై మాట్లాడిన మరో సెలబ్రిటీ ప్రకాష్ రాజ్. భీమ్లా నాయక్ మూవీ విషయంలో ఏపీ సర్కారు అనుసరించిన విధానాన్ని తప్పు పడుతూ ప్రకాశ్ రాజ్ పెట్టిన ట్వీట్ ఇప్పుడు ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్ గా నిలిచింది.

Bheemla Nayak: చేతులెత్తేసిన యాజమాన్యాలు.. కృష్ణాజిల్లాలో థియేటర్లు బంద్!

గతంలో ఇలాగే పవన్ బాటలో హీరో నానీ లాంటి వాళ్ళు నోరు విప్పడంతో తర్వాత అది కాస్త పెద్ద వివాదమై చివరికి సమస్య చాలా పెద్దదైంది. కానీ ఈసారి పవన్ తర్వాత ఈ సమస్యపై ఎవరూ బయటకి రాలేదు. ఇప్పుడు ప్రకాష్ రాజ్ కూడా తోడయ్యారు. మరి ఈ వివాదంపై మరెవరైనా ముందుకొస్తారా లేక.. మనకెందుకులే అని మౌనంగానే ఉండిపోతారా.. ఏపీ ప్రభుత్వం దీనిపై ఎలా ముందుకెళ్తుంది.. ఎలాంటి పరిష్కారం ఇస్తుందన్నది ఆసక్తిగా మారింది.