Prakash Raj : వారం రోజుల పాటు మౌనవ్రతం : ప్రకాష్ రాజ్

ఇటీవల 'మా' ఎలక్షన్స్ లో ప్రకాష్ రాజ్ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. దాదాపు రెండు నెలలు వరుస ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్స్, విమర్శలతో వార్తల్లో నిలిచారు. ఇలా ఎప్పుడూ మాట్లాడుతూనే ఉండే

Prakash Raj : వారం రోజుల పాటు మౌనవ్రతం : ప్రకాష్ రాజ్

Prakash Raj

Prakash Raj :  ప్రకాష్ రాజ్ ఏ విషయం గురించి అయినా చాలా ముక్కుసూటిగా మాట్లాడతాడు. సినిమాల గురించి, రాజకీయాల గురించి మాట్లాడుతూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. ఇటీవల ‘మా’ ఎలక్షన్స్ లో ప్రకాష్ రాజ్ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. దాదాపు రెండు నెలలు వరుస ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్స్, విమర్శలతో వార్తల్లో నిలిచారు. ఇలా ఎప్పుడూ మాట్లాడుతూనే ఉండే ప్రకాష్ రాజ్ తాజాగా వారం రోజుల పాటు మౌన వ్రతం పాటిస్తున్నాను అని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

Samantha : ‘పుష్ప’ ఐటెం సాంగ్ కోసం సమంత భారీ రెమ్యూనరేషన్..

ఇటీవల కొంత అనారోగ్యానికి గురైన ప్రకాశ్‌రాజ్ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకున్నారు. వోకల్‌ కార్డ్స్‌కు వారం రోజుల పాటు పూర్తి స్థాయిలో విశ్రాంతి ఇవ్వాలని, వారం రోజుల పాటు మాట్లాడకూడదని, అవసరమైతేనే మాట్లాడాలని, కారం, మషాలా, బాగా చల్లటి, బాగా వేడి ఉన్న పదార్థాలు తినకూడదని వైద్యులు సూచించారట.

Bigg Boss 5 : మరోసారి నామినేషన్స్ గొడవ.. ఆ ఒక్కరు తప్ప అందరూ నామినేషన్లోనే

దీంతో ప్రకాష్ రాజ్ ట్విట్టర్లో.. ఇటీవలే హెల్త్ చెకప్ చేయించుకున్నాను. నేను చాలా బాగున్నాను. కాకపోతే వోకల్‌ కార్డ్స్‌కు వారం రోజుల పాటు రెస్ట్ ఇవ్వాలని డాక్టర్స్ చెప్పారు. అందుకే వారం రోజుల పాటు మౌనవ్రతం చేయనున్నాను.. సైలెన్స్ అని తెలిపారు. ప్రకాశ్‌రాజ్‌ ట్వీట్‌పై స్పందిస్తూ కొందరు నెటిజన్లు తొందరగా రికవర్ అవ్వాలని కామెంట్లు చేస్తున్నారు.