Prakash Raj: పెద్దల ఆశీర్వాదం నాకొద్దు.. గెలిచే సత్తా నాకుంది.. ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు

తెలుగు సినిమా ఇండస్ట్రీలో "మా" ఎన్నికలు హీట్ పుట్టిస్తున్నాయి.

Prakash Raj: పెద్దల ఆశీర్వాదం నాకొద్దు.. గెలిచే సత్తా నాకుంది.. ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు

Prakash Raj

Prakash Raj: తెలుగు సినిమా ఇండస్ట్రీలో “మా” ఎన్నికలు హీట్ పుట్టిస్తున్నాయి. ప్రతీ ఏడాది మాదిరిగానే అభ్యర్థులు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రధాన అభ్యర్థులుగా ఉన్న ప్రకాష్ రాజ్, మంచు విష్ణూ ఒకరి ప్యానెల్‌పై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. లేటెస్ట్‌గా ఎఫ్ఎన్‌సీసీలో జరిగిన లంచ్ మిట్‌లో ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

మా ఎన్నికల్లో ఎలాంటి పెద్దల ఆశీర్వాదం నాకొద్దని, మా ఎన్నికల్లో గెలిచే సత్తా నాకు ఉందని అన్నారు. ఆ పెద్దళ్లోను ప్రశ్నించే సత్తా ఉన్నవాడే మా అధ్యక్షుడిగా గెలవాలని అన్నారు. ఎవరి కృపాకటాక్షలతో వస్తే వాళ్ల దగ్గరకు వెళ్లి కూర్చోవాలని అన్నారు.

“మా” అసోసియేషన్ సభ్యులను స్టూడియోల్లోకి వదలడం లేదని, అటువంటి పరిస్థితులు లేకుండా ఉండేందుకు గట్టి ప్రయత్నాలు చేయనున్నట్లు చెప్పారు ప్రకాష్ రాజ్. తెలుగువాడు కాదన్న నరేష్ వ్యాఖ్యలపై మండిపడ్డ ప్రకాష్ రాజ్.. నా అంత తెలుగు మంచు విష్ణు ప్యానెల్‌లో ఎవరికీ రాదని అన్నారు. నన్ను పెంచింది తెలుగు భాషేనని అన్నారు.

“మా” సభ్యుల ఆరోగ్యం కోసం ఐదు ప్రముఖ ఆస్పత్రులతో ఒప్పందం చేసుకుంటామని చెప్పారు ప్రకాష్ రాజ్. నటన ఉండాల్సి ముఖంలో కానీ నరనరాల్లో కాదని ఎద్దేవా చేశారు ప్రకాష్ రాజ్. మా అసోసియేషన్ కోసం ఒక బాధ్యతగా పనిచేయాలని మాత్రమే వచ్చానని అన్నారు ప్రకాష్ రాజ్. మా సభ్యుల్లో ఉన్న ప్రతీ ఒక్కరికి ఆత్మాభిమానం ఉందని, వారి ఆత్మగౌరవం కోసమే పనిచేస్తానని చెప్పారు ప్రకాష్ రాజ్.