Bhagat Singh Nagar : మీడియా వారు ఆ వీడియో క్లిప్పింగ్ తీసెయ్యండి.. ప్రకాష్ రాజ్ అసహనం..

తన పర్మిషన్ లేకుండా ‘మా అసోసియేషన్’ ఎన్నికలకు పోటీ చేస్తున్న క్లిప్పింగ్‌ను వాడారని చిత్ర దర్శకుడిపై అసహనం వ్యక్తం చేశారు ప్రకాష్ రాజ్..

Bhagat Singh Nagar : మీడియా వారు ఆ వీడియో క్లిప్పింగ్ తీసెయ్యండి.. ప్రకాష్ రాజ్ అసహనం..

Prakash Raj

Bhagat Singh Nagar: విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ‘భగత్ సింగ్ నగర్’ మూవీ టీజర్ లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో తన గురించి ప్లే చేసిన ఏ.విలో.. తన పర్మిషన్ లేకుండా ‘మా అసోసియేషన్’ ఎన్నికలకు పోటీ చేస్తున్న క్లిప్పింగ్‌ను వాడారని చిత్ర దర్శకుడిపై అసహనం వ్యక్తం చేశారాయన.

గ్రేట్ ఇండియా మీడియా హౌస్ బ్యానర్ మీద విదార్థ్, ధృవిక హీరో హీరోయిన్లుగా వాలాజా క్రాంతి దర్శకత్వంలో, వాలాజా గౌరి, రమేష్ ఉడత్తు నిర్మిస్తున్న చిత్రం ‘భగత్ సింగ్ నగర్’. తెలుగు, తమిళ్ బాషల్లో ఏక కాలంలో చిత్రీకరించి విడుదల చేస్తున్న ఈ సినిమా టీజర్‌ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన నటుడు ప్రకాష్ రాజ్ టీజర్ రిలీజ్ చేశారు. దర్శకులు వీరభద్రం, చిన్ని కృష్ణ, చంద్ర మహేష్ , బాబ్జి, ‘నువ్వు తోపురా’ నిర్మాత శ్రీకాంత్, ‘బట్టల రామస్వామి’ నిర్మాత సతీష్, జూబ్లీహిల్స్ కార్పొరేటర్ వెంకటేష్, యూసుఫ్‌గూడ ఎక్స్ కార్పొరేటర్ సంతోష్, చిత్ర యూనిట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Bhagat Singh Nagar

 

ముఖ్య అతిధిగా వచ్చిన ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. ‘‘నా 30 ఏళ్ల సినీజీవితంలో ఎంతో మంది దర్శకులతో పని చేశాను. వీరంతా నాలోని నటనను చక్కదిద్ది నాలోని ప్రతిభను బయటికి తీసుకువచ్చారు కాబట్టే నేను ఈ రోజు ఇక్కడున్నాను. వారందరికీ పేరు పేరునా ధన్యవాదాలు. నాపై, నేను చేసిన సినిమాల గురించి వేసిన ఏ.వి బాగుంది. కానీ నా పర్మిషన్ లేకుండా ‘మా అసోసియేషన్’ ఎన్నికలకు పోటీ చేస్తున్న క్లిప్పింగ్‌ను ప్రదర్శించడం తప్పు. సినిమాను సినిమాగానే చూద్దాం. నేను మీరు చేసే మంచి ప్రయత్నానికి సపోర్ట్ చేయడానికి వచ్చాను. అవసరమైతే మీడియా వారు ఆ వీడియో క్లిప్పింగ్‌ను తీసివేయమని కోరుతున్నాను. నాకు ‘భగత్ సింగ్’ అంటే ఎంతో ఇష్టం. ఆయన పోరాట పటిమ నాకిష్టం. ఈ దేశమే ‘భగత్ సింగ్’ దేశం అయితే ఎంత బాగుండేదో అనుకునేవాణ్ణి. ఆయన ఉంటే ఈ దేశం ఇప్పుడు ఎక్కడ ఉండేదో.

‘భగత్ సింగ్’ ఉంటే చెగువేరా అంతటి మనిషయ్యేవారు. చెగువేరా క్యూబా లో పోరాటం చేసి గెలిచిన తరువాత ఇప్పుడు నేను ఖాళీగా ఉన్నానే.. ప్రపంచంలో ఎక్కడైనా పోరాటం జరుగుతుంటే అక్కడికెళ్తాను, వారికి నా అవసరం ఉంటుంది. అనేటటువంటి గొప్ప వ్యక్తి. దేశంతో పని లేకుండా సాటి మనిషికి ఏమైనా జరిగితే స్పందించే వ్యక్తిత్వం ఉండాలి. అలాంటి మంచి ఆలోచనతో సినిమా తీస్తున్నారని తెలియగానే పిలిచి మాట్లాడాను. దర్శకుడు క్రాంతి మంచి కథను సెలెక్ట్ చేసుకున్నాడు. ఎంతోమంది గురువులున్నా నాకంటూ ఒక గుర్తింపు రావాలి, మన అలోచలను మన చుట్టూ ఉన్న కథల్ని మన ‘భగత్ సింగ్’ లాంటి వారిని మళ్లీ పరిచయం చేయాలనే గొప్ప ఆలోచనతో వస్తున్న ఇలాంటి యువకుల ఆలోచనలను, ఇలాంటి ప్రయత్నం చేస్తున్న దర్శకులకు మనమంతా సపోర్ట్ చేస్తే సమాజం మెరుగుపడే చిత్రాలు వస్తాయి. కాబట్టి మనమంతా సపోర్ట్‌గా నిలిచి ఎంకరేజ్ చెయ్యాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను. ఇలాంటి మంచి సినిమాను నిర్మిస్తున్న నిర్మాతలను చూసి నేను గర్వపడుతున్నాను’’ అన్నారు.