Prasads IMAX : ప్రపంచంలోనే అతి పొడవైన సినిమా స్క్రీన్‌‌.. మన హైదరాబాద్‌లో!

నూతన టెక్నాలజీతో, అత్యునత క్వాలిటీతో మేకర్స్ సినిమాలను తెరకెక్కించడంతో.. అవి ప్రదర్శించే థియేటర్‌లు కూడా అందుకు అనుగుణంగా రూపుదిద్దుకుంటున్నాయి. ఇక ఎంత సూపర్ హిట్ మూవీ అయిన బుల్లితెర మీద కంటే థియేటర్ లో లార్జ్ స్క్రీన్ మీద చూస్తే ఆ కిక్కె వేరు. ఈ నేపథ్యంలోనే ఇండస్ట్రీలో పలు సూపర్ హిట్ ఓల్డ్ మూవీస్ ని మళ్ళీ రీ రిలీజ్ చేసి.. వెండితెర అనుభూతిని పొందుతున్నారు. తాజాగా ఆ అనుభూతిని మరింత రెట్టింపు చేసేలా హైదరాబాద్ ప్రసాద్స్ ఐమాక్స్...

Prasads IMAX : ప్రపంచంలోనే అతి పొడవైన సినిమా స్క్రీన్‌‌.. మన హైదరాబాద్‌లో!

Prasads IMAX having tallest screen in world

Prasads IMAX : నూతన టెక్నాలజీతో, అత్యునత క్వాలిటీతో మేకర్స్ సినిమాలను తెరకెక్కించడంతో.. అవి ప్రదర్శించే థియేటర్‌లు కూడా అందుకు అనుగుణంగా రూపుదిద్దుకుంటున్నాయి. బాహుబలి 2 సినిమా విడుదల సమయంలో వర్చ్యువల్ రియాలిటీ అనుభూతిని ప్రేక్షకులకు అందజేసేలా థియేటర్ యాజమాన్యం చర్యలు తీసుకుని ఆడియన్స్ కి ఒక కొత్త అనుభూతిని కలగజేశారు.

Avatar 2 : అవతార్ 2 ట్రైలర్ రిలీజ్.. స్టోరీ ఇదేనా..?

ఇక ఎంత సూపర్ హిట్ మూవీ అయిన బుల్లితెర మీద కంటే థియేటర్ లో లార్జ్ స్క్రీన్ మీద చూస్తే ఆ కిక్కె వేరు. ఈ నేపథ్యంలోనే ఇండస్ట్రీలో పలు సూపర్ హిట్ ఓల్డ్ మూవీస్ ని మళ్ళీ రీ రిలీజ్ చేసి.. వెండితెర అనుభూతిని పొందుతున్నారు. తాజాగా ఆ అనుభూతిని మరింత రెట్టింపు చేసేలా హైదరాబాద్ ప్రసాద్స్ ఐమాక్స్ ప్రపంచంలోనే అతి పొడవైన సినిమా స్క్రీన్ ని ఏర్పాటు చేస్తున్నారు.

630 సీటింగ్‌ కెపాసిటీతో 64 అడుగుల ఎత్తు, 101.6 అడుగుల వెడల్పుతో భారీ తెరను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ప్రపంచంలోనే అతి పొడవైన, దేశంలోనే అతిపెద్ద స్క్రీన్‌గా రికార్డు సృష్టించింది. ఈ స్క్రీన్ ని.. డిసెంబర్‌ 16న విడుదల కాబోతున్న అవతార్‌ 2 సినిమాతో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ విషయాన్ని.. ప్రసాద్స్‌ మల్టీప్లెక్స్‌ ఐటీ అండ్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ మోహన్‌కుమార్‌ ట్విట్టర్‌ వేదికగా తెలియజేశారు.