HanuMan: ప్రశాంత్ వర్మ ‘హనుమాన్’ సినిమాను అప్పుడే రిలీజ్ చేస్తాడా..?

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘హను-మాన్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో మనం చూశాం. ఈ సినిమా పోస్టర్స్, టీజర్ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అదిరిపోయే బజ్‌ను క్రియేట్ చేశాయి. ఇక ఈ సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ మూవీకి ఏమాత్రం తగ్గకుండా ఉండేలా చేస్తుందని ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర టీజర్ చూస్తే అర్థమవుతోంది. కాగా, ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ముగించుకున్న చిత్ర యూనిట్, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు.

HanuMan: ప్రశాంత్ వర్మ ‘హనుమాన్’ సినిమాను అప్పుడే రిలీజ్ చేస్తాడా..?

Prashant Varma Planning To Release HanuMan At This Time

HanuMan: టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘హను-మాన్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో మనం చూశాం. ఈ సినిమా పోస్టర్స్, టీజర్ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అదిరిపోయే బజ్‌ను క్రియేట్ చేశాయి. ఇక ఈ సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ మూవీకి ఏమాత్రం తగ్గకుండా ఉండేలా చేస్తుందని ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర టీజర్ చూస్తే అర్థమవుతోంది. కాగా, ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ముగించుకున్న చిత్ర యూనిట్, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు.

Hanuman : ప్రపంచవ్యాప్తంగా 11 భాషల్లో ‘హనుమాన్’ రిలీజ్.. డేట్ అనౌన్స్!

ఈ సినిమాలో భారీ వీఎఫ్ఎక్స్ వర్క్స్ ఉండటంతో, ప్రస్తుతం ఆ పనుల్లో నిమగ్నమైపోయారు చిత్ర యూనిట్. తేజ సజ్జా హీరోగా నటిస్తున్న ఈ సినిమాను సూపర్ హీరో మూవీగా దర్శకుడు ప్రశాంత్ వీర్మ తీర్చిదిద్దుతుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమా కథ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఖచ్చితంగా విజయం సాధిస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ సినిమాను వేసవి కానుకగా మే 5న రిలీజ్ చేసేందుకు ప్రశాంత్ వర్మ ప్లాన్ చేస్తున్నాడట. సమ్మర్ కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేస్తే, అందరూ ఈ సినిమాను చూసే అవకాశం ఉంటుందని ఆయన భావిస్తున్నాడట.

Hanuman: అండర్‌వాటర్‌లో హనుమాన్ అడ్వెంచర్.. మామూలుగా ఉండదట!

ఇక ఈ సినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తోండగా, వరలక్ష్మీ శరత్ కుమార్ అంజమ్మ అనే కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాను ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై కె.నిరంజన్ రెడ్డి భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరి వేసవి కానుకగా, అనుకున్న సమయానికి హనుమాన్ సినిమాను ప్రశాంత్ వర్మ ప్రేక్షకుల ముందుకు తీసుకురాగలడా లేడా అనేది చూడాలి.