NTR: ఎన్టీఆర్ కోసం భారీగా ప్లాన్ చేస్తున్న ప్రశాంత్ నీల్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన రీసెంట్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ రాజమౌళి...

NTR: ఎన్టీఆర్ కోసం భారీగా ప్లాన్ చేస్తున్న ప్రశాంత్ నీల్

Prashanth Neel Planning Big For Ntr

NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన రీసెంట్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించడంతో ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటించడంతో ఈ సినిమాను చూసేందుకు జనం థియేటర్లకు క్యూ కట్టారు. కాగా ఈ సినిమా బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకోవడంతో తారక్ తన నెక్ట్స్ చిత్రాల కోసం రెడీ అవుతున్నాడు.

Jr NTR: చిల్ మూడ్ నుండి వర్క్ మూడ్‌లోకి ఎన్టీఆర్.. ఇక దూకుడే!

ఇప్పటికే స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తారక్ 30వ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమను ఇప్పటికే అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన చిత్ర యూనిట్, త్వరలోనే ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. అయితే తారక్ పుట్టినరోజైన మే 20న అభిమానులు అదిరిపోయే ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. కొరటాల సినిమాతో పాటు కేజీయఫ్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో తారక్ చేయబోయే 31వ చిత్రానికి సంబంధించి కూడా ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ను ఇచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో తారక్ లుక్ కోసం ఇప్పటికే లుక్ టెస్ట్ కూడా నిర్వహించాడట దర్శకుడు ప్రశాంత్ నీల్.

NTR: క్వశ్చన్ పేపర్‌లో ఎన్టీఆర్ టాపిక్.. నెట్టింట వైరల్!

ఇక మే 20న తారక్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీలుక్ పోస్టర్ ను రిలీజ్ చేయాలని ప్రశాంత్ నీల్ అండ్ తారక్ లు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను కూడా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించేందుకు తారక్ రెడీ అవుతుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అప్పుడే ప్రేక్షకుల్లో నెలకొంది. మరి నిజంగానే తారక్ పుట్టినరోజున ఈ సినిమా నుండి పవర్‌ఫుల్ అప్‌డేట్ ఉండబోతుందా అనేది చూడాలి.