NTR31: తారక్ కోసం టైటిల్స్ రెడీ చేస్తున్న ప్రశాంత్ నీల్..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన నెక్ట్స్ చిత్రాల కోసం రెడీ అవుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆర్ఆర్ఆర్ చిత్రంతో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న తారక్, తన కెరీర్‌లోని 30వ...

NTR31: తారక్ కోసం టైటిల్స్ రెడీ చేస్తున్న ప్రశాంత్ నీల్..?

Prashanth Neel Readies Two Titles For Ntr31 Movie

NTR31: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన నెక్ట్స్ చిత్రాల కోసం రెడీ అవుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆర్ఆర్ఆర్ చిత్రంతో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న తారక్, తన కెరీర్‌లోని 30వ చిత్రాన్ని దర్శకుడు కొరటాల శివతో, 31వ చిత్రాన్ని ప్రశాంత్ నీల్‌తో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఈ రెండు సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్‌ను ఇటీవల తారక్ పుట్టినరోజు కానుకగా అనౌన్స్ చేశారు చిత్ర యూనిట్.

NTR31: తారక్ ఫ్యాన్స్ కొత్త రచ్చ.. ఆ హీరోయినే కావాలట!

ఇక ఇందులో కొరటాల శివతో చేయబోయే సినిమాను అతి త్వరలో పట్టాలెక్కించేందుకు తారక్ రెడీ అవుతున్నాడు. అయితే ఈ సినిమా తరువాత కేజీయఫ్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో తారక్ ఓ పవర్‌ఫుల్ కథతో రాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా ప్రీలుక్‌లోనూ తారక్ చాలా ఊరమాస్‌గా కనిపించి ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుషీ చేశాడు. ఇటీవల సరైన మాస్ సినిమా పడక తారక్ అభిమానులు నిరాశకు లోనవుతున్నారు. అయితే ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో రాబోయే సినిమాలో తారక్ ప్రీలుక్ చూస్తుంటే, ఈ సినిమాలో ఆయన పాత్ర ఎలా ఉండబోతుందా అనే అంచనాలు వేస్తున్నారు అభిమానులు.

NTR30-NTR31: కొరటాల-ఎన్టీఆర్-ప్రశాంత్.. ఫస్ట్ లుక్‌తోనే ప్రకంపనలు!

కాగా.. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఇండస్ట్రీ వర్గాల్లో ఓ వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది. పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ విషయంలో ప్రశాంత్ నీల్ అప్పుడే రెండు టైటిల్స్‌ను పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ‘అసుర’, ‘అసురుడు’ అనే రెండు టైటిల్స్‌లో ఒకదానిని ఈ ప్రాజెక్టుకు పెట్టాలని ప్రశాంత్ నీల్ భావిస్తున్నాడు. ఎన్టీఆర్ పాత్రకు ఈ టైటిల్ పర్ఫెక్ట్‌గా సరిపోతుందని ఆయన భావిస్తున్నాడట. మరి నిజంగానే ఎన్టీఆర్ 31వ చిత్రానికి ప్రశాంత్ నీల్ ఈ టైటిల్స్‌ను పరిశీలిస్తున్నాడా.. నిజంగానే ఈ రెండింటిలో ఒకదాన్ని ఫైనల్ చేస్తారా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.