Nani: నేచురల్ స్టార్‌ను ఊరమాస్‌గా మార్చనున్న డైరెక్టర్..?

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘‘అంటే సుందరానికీ..!’’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు వివేక్ ఆత్రేయ....

Nani: నేచురల్ స్టార్‌ను ఊరమాస్‌గా మార్చనున్న డైరెక్టర్..?

Prashanth Neel To Team Up With Natural Star Nani

Nani: నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘‘అంటే సుందరానికీ..!’’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తుండటంతో ఈ మూవీపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో మలయాళ బ్యూటీ నజ్రియా ఫాజిల్ హీరోయిన్‌గా తెలుగు తెరకు తొలిసారి పరిచయం అవుతుండటంతో ఈ సినిమాలో వీరిద్దరి కాంబినేషన్ ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

Nani: ‘ఎంత చిత్రం’ అంటూ లీల భుజంపై వాలిపోయిన సుందరం!

అయితే ఈ సినిమా తరువాత నాని తన నెక్ట్స్ మూవీ ‘దసరా’ను కూడా పట్టాలెక్కిస్తూ బిజీగా ఉన్నాడు. తెలంగాణ ప్రాంతంలో జరిగిన ఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ సినిమాలో నాని తొలిసారి మాస్ లుక్‌లో మనకు కనిపిస్తున్నాడు. ఇక ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ ప్రాజెక్టులను కూడా సైలెంట్‌గా ఓకే చేసేందుకు రెడీ అవుతున్నాడు ఈ హీరో. ఈ క్రమంలోనే ఎవరూ ఊహించని విధంగా నాని ఓ సెన్సేషనల్ డైరెక్టర్‌తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ జోరుగా వినిపిస్తోంది.

కేజీయఫ్ చిత్రాలతో తన సత్తా ఏమిటో చాటుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్, ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో కలిసి సలార్ అనే మరో పవర్‌ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తరువాత ప్రశాంత్ నీల్ తన నెక్ట్స్ మూవీని యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో చేయబోతున్నట్లు ఇటీవల అఫీషియల్‌గా కూడా అనౌన్స్ చేశాడు. అయితే ఈ డైరెక్టర్ ఓ కథను నానికి చెప్పగా, అది బాగా నచ్చిన నాని వెంటనే చేసేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది.

Nani: అంటే సుందరానికీ.. తెలుగులోనే కాదు!

ఇక ఈ సినిమాలో నాని దసరా చిత్రం కంటే కూడా ఊరమాస్ లుక్‌లో కనిపించబోతున్నాడట. ప్రశాంత్ నీల్ ఈ సినిమాను కూడా తనదైన మార్క్ మూవీగా తెరకెక్కించబోతున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే నిజంగానే ఈ కాంబినేషన్ సెట్ అవుతుందా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ ఈ కాంబినేషన్ నిజంగా సెట్ అయితే మాత్రం నాని ఫ్యాన్స్ రచ్చ మామూలుగా ఉండదని చెప్పాలి.