Prashanth Varma: హనుమాన్ అప్డేట్.. ఆగాల్సిందే అంటోన్న డైరెక్టర్!

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్ర ‘హనుమాన్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మను నెటిజన్లు అడుగుతున్నారు. ఈ క్రమంలో దర్శకుడు ప్రశాంత్ వర్మ తాజాగా హనుమాన్ సినిమా గురించి ఓ తాజా అప్డేట్ ఇచ్చారు.

Prashanth Varma: హనుమాన్ అప్డేట్.. ఆగాల్సిందే అంటోన్న డైరెక్టర్!

Prashanth Varma: టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్ర ‘హనుమాన్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ సినిమాలో యంగ్ హీరో తేజా సజ్జా నటిస్తుండగా, ది ఫస్ట్ ఒరిజినల్ సూపర్ హీరో అనే ట్యాగ్ లైన్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫిక్షన్ కథతో తెరకెక్కుతోంది. అయితే కేవలం ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్ మాత్రమే రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.

Hanu-Man : ‘అంజనాద్రి’ ప్రపంచంలోకి తీసుకెళ్తున్న ‘హనుమంతు’..

దీంతో ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మను నెటిజన్లు అడుగుతున్నారు. ఈ క్రమంలో దర్శకుడు ప్రశాంత్ వర్మ తాజాగా హనుమాన్ సినిమా గురించి ఓ తాజా అప్డేట్ ఇచ్చారు. ప్రస్తుతం హనుమాన్ సినిమాకు సంబంధించి వీఎఫ్ఎక్స్ పనుల్లో బిజీగా ఉన్నామని.. సినిమాను మంచి ఔట్‌పుట్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని ప్రశాంత్ వర్మ తెలిపాడు.

Hanu Man : ఒరిజినల్‌ ఇండియన్‌ సూపర్‌ హీరో ఫిల్మ్‌ ‘హను–మాన్‌’..

మొత్తానికి హనుమాన్ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఆడియెన్స్‌కు దర్శకుడు ప్రశాంత్ వర్మ ఓ అదిరిపోయే అప్డేట్ అయితే ఇచ్చాడు. ఇక ఈ సినిమాలో అమృతా అయ్యర్, వినయ్ రాయ్, వరలక్ష్మీ శరత్ కుమార్‌లు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కాగా, ఈ సినిమాను నిరంజన్ రెడ్డి ప్రొడ్యూస్ చేస్తుండగా, అతి త్వరలోనే ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.