Pregnancy Bible : ‘మూడో బిడ్డను’ పరిచయం చేసిన కరీనా

బాలీవుడ్ నటి కరీనా కపూర్ తాను రాసిన పుస్తకాన్ని విడుదల చేశారు. తన ఇద్దరు బిడ్డలను కడుపులో మోస్తున్నప్పటి శారీరక, మానసిక అనుభవాలను, కష్టనష్టాలను, పలువురు నిపుణుల సలహాలు, సూచనలను ఈ పుస్తకంలో రాసుకొచ్చినట్లు ఇన్‌స్టా పోస్ట్‌లో తెలిపారు. కాగా ఈ పుస్తకానికి ఆమె ‘ప్రెగ్నెన్సీ బైబిల్‌’ అని పేరుపెట్టారు.

Pregnancy Bible : ‘మూడో బిడ్డను’ పరిచయం చేసిన కరీనా

Pregnancy Bible

Pregnancy Bible : బాలీవుడ్ నటి కరీనా కపూర్ తాను రాసిన పుస్తకాన్ని విడుదల చేశారు. తన ఇద్దరు బిడ్డలను కడుపులో మోస్తున్నప్పటి శారీరక, మానసిక అనుభవాలను, కష్టనష్టాలను, పలువురు నిపుణుల సలహాలు, సూచనలను ఈ పుస్తకంలో రాసుకొచ్చినట్లు ఇన్‌స్టా పోస్ట్‌లో తెలిపారు. కాగా ఈ పుస్తకానికి ఆమె ‘ప్రెగ్నెన్సీ బైబిల్‌’ అని పేరుపెట్టారు. వంటగదిలో అవెన్‌ లోంచి ఈ బుక్‌ హాట్‌ హాట్‌ కాపీని బయటకు తీయడం విశేషం.

ఈ పుస్తకం తనకు మూడో బిడ్డలాంటిదని కరీనా వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించి ఒకవీడియోను ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. తాను రాసిన ‘ప్రెగ్నెన్సీ బైబిల్‌’ పుస్తకానికి స్త్రీ వైద్య నిపుణులు, ప్రసూతి వైద్యుల అధికారిక సంస్థ అనుమతి లభించడం గర్వంగా ఉందని కరీనా పేర్కొన్నారు.

ఈ పుస్తకంలో కాబోయే తల్లులకు ఉపయోగపడేలా కీలక చిట్కాలను, సమాచారాన్ని రాసినట్లు తెలిపారు. కాగా సైఫ్ అలీ ఖాన్‌, కరీనా దంపతులు ఈ ఏడాది ఫిబ్రవరిలో రెండవ బిడ్డకు జన్మనిచ్చిన విషయం విదితమే.

 

 

View this post on Instagram

 

A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan)