Prema Desam : ట్రెండ్ సెట్టర్ ట్రయాంగిల్ లవ్ స్టోరీకి సీక్వెల్..

లవ్ స్టోరీ సినిమాల్లో మెమరబుల్ మూవీగా నిలిచిన ‘ప్రేమ దేశం’ చిత్రానికి పాతికేళ్ల తర్వాత సీక్వెల్ రాబోతుంది..

Prema Desam : ట్రెండ్ సెట్టర్ ట్రయాంగిల్ లవ్ స్టోరీకి సీక్వెల్..

Prema Desam

Prema Desam: ఇండియన్ సినిమా హిస్టరీలో ఎన్నో అద్భుతమైన, మరపురాని ప్రేమకథా చిత్రాలున్నాయి. ఆ సినిమాలు ఇప్పుడు చూసినా ఫ్రెష్ ఫీల్ కలుగుతుంది. అలాంటి సినిమాల లిస్టులో కచ్చితంగా చెప్పుకునే మూవీ ‘ప్రేమ దేశం’. ఈ కల్ట్ క్లాసిక్ లవ్ ఫిలిం క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు.

Chiranjeevi : సాయి పల్లవిని మెగాస్టార్ మామూలుగా ఏడిపించలేదుగా..!

అబ్బాస్, వినీత్, టబు మెయిన్ లీడ్స్‌గా.. కథిర్ డైరెక్షన్లో, కె. కుంజుమొన్ నిర్మించిన బిగ్గెస్ట్ మ్యూజికల్ లవ్ స్టోరీ ‘ప్రేమ దేశం’.. తమిళ్‌లో ‘కాదల్ దేశం’ పేరుతో 23 ఆగస్టు 1996న విడుదలైంది. ఇలాంటి ఓ ట్రయాంగిల్ లవ్ స్టోరీ చూసి ఆడియన్స్ సర్‌ప్రైజ్ అయ్యారు.

Chiranjeevi:ఇబ్బంది పెట్టొద్దు.. పట్టించుకోండి ప్లీజ్.. చిరంజీవి సంచలన వ్యాఖ్యలు

తర్వాత తెలుగులో ‘ప్రేమ దేశం’ పేరుతో డబ్ చేసి రిలీజ్ చేశారు. డైరెక్టర్ విజన్, ఆర్టిస్టుల సెటిల్డ్ పర్ఫార్మెన్స్, ఏఆర్ రెహమాన్ పాటలు, బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు బ్యాక్‌బోన్‌లా నిలిచాయి. నిర్మాతకు, దర్శకుడికి, మ్యూజిక్ డైరెక్టర్‌కి స్టార్ డమ్ తెచ్చిపెట్టిందీ సినిమా..

Prema Desam

 

తమిళనాట టబుకిది ఫస్ట్ సినిమా.. అబ్బాస్‌కి కూడా మొదటి సినిమానే.. ఇన్నాళ్టికి ఈ సినిమా సీక్వెల్‌పై ఫోకస్ పెట్టారు దర్శకుడు కథిర్. పదేళ్ల క్రితమే సీక్వెల్ గురించి వార్తలు వచ్చాయి. ఎట్టకేలకు పాతికేళ్ల తర్వాత ‘ప్రేమ దేశం’ సీక్వెల్ చెయ్యబోతున్నానని, అందులో అందరూ కొత్త వారితోనే ఈ సినిమా చెయ్యబోతున్నానని చెప్పారు దర్శకుడు కథిర్.

Rashmika Mandanna : సౌందర్య బయోపిక్ కోసం వెయిట్ చేస్తున్న రష్మిక..