శర్వానంద్ ‘శ్రీకారం’ ఫస్ట్‌లుక్ చూశారా!

యంగ్ హీరో శర్వానంద్ పల్లెటూరి కుర్రాడిగా నటిస్తున్న ‘శ్రీకారం’ ఫస్ట్‌లుక్ రిలీజ్..

  • Published By: sekhar ,Published On : January 27, 2020 / 07:27 AM IST
శర్వానంద్ ‘శ్రీకారం’ ఫస్ట్‌లుక్ చూశారా!

యంగ్ హీరో శర్వానంద్ పల్లెటూరి కుర్రాడిగా నటిస్తున్న ‘శ్రీకారం’ ఫస్ట్‌లుక్ రిలీజ్..

యంగ్ హీరో శర్వానంద్ నటిస్తున్న 29వ సినిమా ‘శ్రీకారం’. సోమవారం ఉదయం ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. కిశోర్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట నిర్మిస్తున్నారు.

Image

‘ఇతను మన కేశవుల కొడుకు… పొద్దున్నే పొలం పనికి వెళ్తున్నాడు చూడండి’.. అంటూ శర్వా పొలంలో నడుస్తున్న లుక్ రిలీజ్ చేశారు. గల్లచొక్కా, లుంగీతో పక్కా పల్లెటూరి రైతు కుర్రాడిలా కనిపిస్తున్నాడు శర్వా. ప్రియాంక మోహన్ కథానాయికగా నటిస్తుంది.

Read Also : ఆమిర్ అడిగాడు.. అక్షయ్ తగ్గాడు – బచ్చన్ పాండే న్యూ రిలీజ్ డేట్

Image

ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. వేసవిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. రావు రమేష్, ఆమని, సీనియర్ నరేష్, సాయికుమార్, మురళీ శర్మ, సత్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం : మిక్కీ జె. మేయర్, మాటలు : సాయిమాధవ్ బుర్రా, కెమెరా : జె. యువరాజ్, ఎడిటింగ్ : మార్తాండ్ కె. వెంకటేష్
ఆర్ట్ : అవినాష్ కొల్లా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : హరీష్ కట్టా, నిర్మాతలు : రామ్ ఆచంట, గోపి ఆచంట
దర్శకత్వం : కిషోర్ బి.