టోటల్ ధమాల్-మున్గుడా వీడియో సాంగ్

టోటల్ ధమాల్-మున్గుడా వీడియో సాంగ్ రిలీజ్.

  • Published By: sekhar ,Published On : February 5, 2019 / 07:56 AM IST
టోటల్ ధమాల్-మున్గుడా వీడియో సాంగ్

టోటల్ ధమాల్-మున్గుడా వీడియో సాంగ్ రిలీజ్.

అనిల్ కపూర్, అజయ్ దేవ్‌గణ్, మాధురీ దీక్షిత్, ఈషా గుప్తా తారాగణంగా, ఇంద్ర కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న హిలేరియస్ కామెడీ ఎంటర్‌టైనర్.. టోటల్ ధమాల్.. ఫాక్స్ స్టార్ స్టూడియో, అజయ్ దేవ్‌గణ్ ఫిలింస్, అశోక్ థకేరియా, ఇంద్ర కుమార్, శ్రీ అధికారి బ్రదర్స్, మరియు ఆనంద్ పండిట్ నిర్మాతలు.. ఇంతకుముందు రిలీజ్ చేసిన ట్రైలర్ అండ్ పైసా హే పైసా సాంగ్‌కి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడీ సినిమాలో నుండి.. మున్గుడా అనే వీడియో సాంగ్ రిలీజ్ అయ్యింది. ఈ సాంగ్‌లో సోనాక్షీ సిన్హాతో కలిసి అజయ్ దేవ్‌గణ్ స్టెప్స్ వేసాడు. సాంగ్‌లో సెక్సీ లుక్స్‌తో, సింపుల్ అండ్ స్టైలిష్ స్టెప్స్‌తో సోనాక్షీ ఆకట్టుకుంది.

స్విమ్మింగ్ పూల్‌లో, తడి అందాలతో కుర్రకారుని కవ్విస్తుంది. ఈ వీడియోని కుకీ గులాటీ డైరెక్ట్ చేసాడు.. కున్వార్ జునేజా లిరిక్స్ రాసాడు.. గౌరవ్-రోషిన్ మ్యూజిక్ కంపోజ్ చేసారు. బొమన్ ఇరానీ, సంజయ్ దత్, అర్షద్ వార్షీ, జావేద్ జాఫ్రీ, సంజయ్ మిశ్రా ఇతర పాత్రల్లో నటిస్తుండగా, అమీర్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించనున్నాడు. జాకీ ష్రాఫ్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు. ఫిబ్రవరి 22న టోటల్ ధమాల్ రిలీజ్ కానుంది.

వాచ్ వీడియో సాంగ్…