‘ఆచార్య’ ఒరిజినల్ స్క్రిప్ట్ కొరటాల శివదే.. ఆరోపణలు అవాస్తవం.. మైత్రీ మూవీ మేకర్స్ అధికారిక ప్రకటన..

  • Published By: sekhar ,Published On : August 27, 2020 / 05:08 PM IST
‘ఆచార్య’ ఒరిజినల్ స్క్రిప్ట్ కొరటాల శివదే.. ఆరోపణలు అవాస్తవం.. మైత్రీ మూవీ మేకర్స్ అధికారిక ప్రకటన..

Acharya Movie unit on Copy Allegations: మెగాస్టార్ చిరంజీవి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఆచార్య సినిమా టైటిల్ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ టైటిల్ పోస్ట‌ర్‌కు అన్నీ వ‌ర్గాల ప్రేక్ష‌కుల నుండి అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. ఈ సినిమాకు వ‌చ్చిన హైప్ చూసి కొంద‌రు రైట‌ర్స్ ‘ఆచార్య‌’ సినిమా కథ తమదంటూ తప్పుడు ఆరోపణలు చేశారు.
ఈ ఆరోపణలపై తాజాగా ఆచార్య చిత్రాన్ని నిర్మిస్తున్న మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.

‘‘సినిమా చిత్రీకరణ జరుగుతుండటం వల్ల సినిమా కథను రహస్యంగానే ఉంచాం. చాలా తక్కువ మందికి మాత్రమే కథ గురించిన అవగాహన ఉంది. కేవలం మోషన్ పోస్టర్‌ను చూసి ఇలాంటి ఆరోప‌ణ‌లు చేయ‌డం బాధాక‌రం. అంద‌రికీ చెప్పాల‌నుకున్న విష‌య‌మొక‌టే.. ‘ఆచార్య‌’ క‌థ ఒరిజిన‌ల్‌. కొర‌టాల శివ‌లాంటి పేరున్న ద‌ర్శ‌కుల‌పై ఇలాంటి ఆరోప‌ణ‌లు చేయ‌డం త‌గ‌దు. కొన్ని ప్రింట్‌, ఎల‌క్ట్రానిక్ మీడియాల్లో ‘ఆచార్య‌’ సినిమా గురించి వ‌స్తోన్న రూమ‌ర్ స్టోరీల‌ను ఆధారంగా చేసుకుని ఇలాంటి ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. ఈ క‌థ‌పై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌న్నీ నిరాధార‌మైన‌వి, త‌ప్పుడు క‌థ‌నాలు. ఎవ‌రికి వారు ఉహించుకున్నవి. ఈ క‌థ కోసం మెగాస్టార్‌తో కొర‌టాల శివ రెండేళ్ల పాటు ట్రావెల్ అయ్యారు. ఆయ‌న ఇమేజ్‌కు త‌గినట్లు పర్‌ఫెక్ట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ‘ఆచార్య‌’ సినిమా క‌థ‌ను సిద్ధం చేశారు’’.. అని తెలిపారు.

Matinee Entertainment

కాగా తాను చెప్పిన కథను రికార్డ్ చేసి, తనను మోసం చేశారంటూ రాజేష్ అనే వ్యక్తి తమపై చేసిన ఆరోపణల గురించి మైత్రీ మూవీస్ సంస్థ స్పందించింది.
‘‘రాజేష్ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి.. అతను చెప్పిన కథ చాలా బాగుంటే మేమే సినిమాను నిర్మించే వాళ్ళం. గతేడాది భారత్ కమ్మ (డియర్ కామ్రేడ్), రితేష్ రానా (మత్తు వదలారా) సానా బుచ్చిబాబు (ఉప్పెనా) ఈ ముగ్గురు కొత్త దర్శకులను పరిచయం చేసిన ఖ్యాతి మైత్రీ సంస్థకు ఉంది. కథ బాగుంటే మరొక కొత్త దర్శకుడిని పరిచయం చేయకుండా ఎందుకు ఉంటాం?

వాస్తవం ఏంటంటే, మాకు రాజేష్ వివరించిన కథ చాలా బలహీనంగా ఉంది అలాగే కంటెంట్‌లో ఎటువంటి విషయం లేదు.. అందువల్ల మేము తిరస్కరించాము. అదే అతనికి తెలియజేసాం. కథ బాగోనప్పుడు, మేము కొరటాల శివ వద్దకు వెళ్లి ఎలా కథ గురించి చెబుతాము. కొరటాల శివ జీనియస్ దర్శకుడిగా, విలువలు కలిగిన మంచి వ్యక్తిగా గుర్తింపు సంపాదించారు. ఎటువంటి ఆధారాలు లేదా రుజువులు లేని ఈ రాజేష్ మైత్రీ మూవీస్ ఇమేజ్‌ని, కోరటాల శివ పేరు ప్రతిష్టలను దెబ్బతీసేందుకు మీడియాకు వెళ్లడం దురదృష్టకరం. మీడియాలో రాజేష్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాం.. అలాగే ఆయనపై తగిన చర్యలు తీసుకుంటాం’’.. అని మైత్రీ మూవీస్ వారు తెలిపారు.

Mythri Movie Makers