ప్రియా వారియర్-లవర్స్ డే వీడియో సాంగ్

లవర్స్ డే మూవీలోని ఏ పిల్లా, ఫ్రీక్ పిల్లా.. వీడియో సాంగ్‌ రిలీజ్.

  • Published By: sekhar ,Published On : February 5, 2019 / 11:37 AM IST
ప్రియా వారియర్-లవర్స్ డే వీడియో సాంగ్

లవర్స్ డే మూవీలోని ఏ పిల్లా, ఫ్రీక్ పిల్లా.. వీడియో సాంగ్‌ రిలీజ్.

 ప్రియా వారియర్.. కొంటె చూపుతో, ఒకే ఒక కన్ను గీటుతో, కోట్లాది మంది కుర్రకారుకి కంటిమీద కునుకు లేకుండా చేసింది. ఆమె నటించిన మలయాళ సినిమా ఒరు ఆధార్ లవ్, తెలుగులో లవర్స్ డే టైటిల్‌తో రానుంది. ప్రియా వారియర్, రోషన్ జంటగా నటించగా, సి.హెచ్.వినోద్ రెడ్డి సమర్పణలో, సుఖీభవ సినిమాస్ నిర్మించిన లవర్స్ డే మూవీలోని ఏ పిల్లా, ఫ్రీక్ పిల్లా.. అనే వీడియో సాంగ్‌ని రీసెంట్‌గా రిలీజ్ చేసింది మూవీ యూనిట్.

ఈ సాంగ్‌కి.. శ్రీజో లిరిక్స్, షాన్ రెహమాన్ మ్యూజిక్, దినకర్ అండ్ నీతుల వాయిస్, కొరియోగ్రఫీ అన్నీ పర్‌ఫెక్ట్‌గా సెట్ అయ్యాయి. ముఖ్యంగా హీరో, హీరోయిన్ల కెమిస్ట్రీ చాలా బాగుంది. ఒమర్ లులు డైరెక్ట్ చేసిన లవర్స్ డే, లవర్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న రిలీజ్ అవబోతోంది. ఈ సినిమాకి కెమెరా : సిను సిద్ధార్థ్, ఎడిటింగ్ : అచ్చు విజయన్.

వాచ్ ఫ్రీక్ పిల్లా సాంగ్…