ప్రియాకి పిచ్చెక్కించాడుగా!

ప్రియా వారియర్, రోషన్ జంటగా  నటించిన లవర్స్ డే టీజర్ రిలీజ్.

  • Published By: sekhar ,Published On : February 7, 2019 / 05:49 AM IST
ప్రియాకి పిచ్చెక్కించాడుగా!

ప్రియా వారియర్, రోషన్ జంటగా  నటించిన లవర్స్ డే టీజర్ రిలీజ్.

కొంటె సైగతో, కుర్రాళ్ళ మనసులకు గన్ను లాంటి కన్ను కొట్టిన  ప్రియా వారియర్, రోషన్ జంటగా  నటించిన మలయాళ సినిమా ఒరు ఆధార్ లవ్, తెలుగులో లవర్స్ డేగా రిలీజవుతుంది. సి.హెచ్.వినోద్ రెడ్డి సమర్పణలో, సుఖీభవ సినిమాస్ బ్యానర్‌పై, ఏ.గురురాజ్ నిర్మించిన లవర్స్ డే, సెలబ్రేషన్ ఆఫ్ లవ్.. మూవీలోని ఏ పిల్లా, ఫ్రీక్ పిల్లా.. అనే వీడియో సాంగ్‌ రిలీజ్ చెయ్యగా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పుడు లవర్స్ డే టీజర్ రిలీజ్ అయ్యింది. ప్రియా, రోషన్‌ల మధ్య జరిగిన ఒక రొమాంటిక్ సీన్‌నే టీజర్‌గా కట్ చేసారు. మనిద్దరికీ ఇంత త్వరగా సెట్ అవుతుందని నేననుకోలేదు అని రోషన్ అంటే, ప్రియా, అయ్యా, సెట్టయ్యిందా, ఏం సెట్టయ్యింది? అని తెలియనట్టు అడిగితే, రోషన్.. మరైతే నిన్న ఎందుకని నాకు సైట్ కొట్టావ్? అనడిగితే, ప్రియ గుర్తులేదని చెప్పడం..

ఒక మధురమైన మూతి ముద్దిచ్చి, గుర్తు చేసి, ఏంటి, ఇప్పుడు నీకూ అనిపించిందా? అనడగడం, ప్రియ ఫీల్‌తో సిగ్గు పడడంతో టీజర్ ఫినిష్ అయ్యింది. టీజర్‌ని బట్టి, లవర్స్ డే.. మాంచి యూత్‌ఫుల్, రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిందని అర్థమవుతుంది. మలయాళంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన లవర్స్ డే.. తెలుగులో లవర్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న రిలీజ్ అవబోతోంది. ఈ సినిమాకి కెమెరా : సిను సిద్ధార్థ్, ఎడిటింగ్ : అచ్చు విజయన్.

వాచ్ టీజర్…