NBK108: బాలయ్య కోసం సీనియర్ హీరోయిన్..?

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న....

NBK108: బాలయ్య కోసం సీనియర్ హీరోయిన్..?

Priyamani As Balakrishna Heroine For Nbk108

NBK108: నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమాను చిత్ర యూనిట్ రూపొందిస్తోంది. ఇక ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమా పూర్తికాగానే, బాలయ్య తన నెక్ట్స్ చిత్రాన్ని మరో యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.

NBK108: బర్త్ డే రోజున ఫ్యాన్స్ కు బాలయ్య రోరింగ్ ట్రీట్!

ఈ సినిమాకు సంబంధించి ఇటీవల అనిల్ రావిపూడి పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా చేశారు. ఈ సినిమాలో బాలయ్యతో కామెడీ చేయించేందుకు అనిల్ ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్‌గా శ్రీలీలా పేరు వినిపించడంతో, ఆమె బాలయ్య కూతురి పాత్రలో ఈ సినిమాలో నటించబోతున్నట్లు అనిల్ రావిపూడి కన్ఫం చేశాడు. దీంతో బాలయ్య సరసన హీరోయిన్‌గా ఎవరు నటిస్తారా అని అందరూ అనుకుంటున్నారు.

Balakrishna: బాలయ్య కోసం హీరోయిన్‌ను ఫిక్స్ చేసిన అనిల్..?

అయితే దీని కోసం కూడా అనిల్ రావిపూడి అప్పుడే పర్ఫెక్ట్ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. బాలయ్య సరసన సీనియర్ బ్యూటీ ప్రియమణిని హీరోయిన్‌గా తీసుకునేందుకు అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నాడట. ప్రియమణి గతంలో బాలయ్య సరసన ‘మిత్రుడు’ అనే సినిమాలో నటించింది. ఇప్పుడు ఇంత కాలం తరువాత మళ్లీ బాలయ్యతో సినిమాలో నటించే అవకాశం రావడంతో ఆమె కూడా ఈ సినిమాకు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. మరి నిజంగానే ఈ సినిమాలో ప్రియమణి నటిస్తుందా లేదా అనేది తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.