Priyamani : డిసెంబర్ 9న రాబోతోన్న ప్రియమణి ‘డాక్టర్ 56’..

ప్రస్తుతం కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలకు మంచి ఆదరణ దక్కుతోంది. అలాంటి ఓ డిఫరెంట్ కథతోనే ప్రియమణి ముందుకు వస్తున్నారు. పాన్ ఇండియన్ స్టార్ ప్రియమణి ప్రస్తుతం డాక్టర్ 56 అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కాగా ఈ సినిమాకు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి...

Priyamani : డిసెంబర్ 9న రాబోతోన్న ప్రియమణి ‘డాక్టర్ 56’..

Priyamani Doctor 56 Movie Released on December 9

Priyamani : ప్రస్తుతం కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలకు మంచి ఆదరణ దక్కుతోంది. అలాంటి ఓ డిఫరెంట్ కథతోనే ప్రియమణి ముందుకు వస్తున్నారు. పాన్ ఇండియన్ స్టార్ ప్రియమణి ప్రస్తుతం డాక్టర్ 56 అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రవీణ్, దీపక్ రాజ్‌శెట్టి, రమేష్‌ భట్, యతిరాజ్, వీణా పొన్నప్ప, మంజునాథ్ హెగ్డే, స్వాతి తదితరులు నటిస్తున్నారు.

Priyamani : ప్రియమణి పాన్ ఇండియా సినిమా ‘డాక్టర్ 56’.. విజయ్ సేతుపతి చేతుల మీదుగా ఫస్ట్ లుక్..

కాగా ఈ సినిమాకు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి వచ్చి ప్రమోషన్ చేయడంతో అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చింది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 9న విడుదల చేయబోతోన్నట్టు మేకర్లు ప్రకటించారు. దీంతో పాటుగా మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో సినిమా కాన్సెప్ట్ ఏంటో చెప్పేశారు. ఇండియాలో ఐదేళ్లలో 2163 మంది అంటూ అలా సస్పెన్స్‌గా వదిలేశారు. మోషన్ పోస్టర్లో చూపించిన ఈ సంఖ్య, ప్రియమణి గన్నుపట్టుకున్న తీరు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి.

ఈ సినిమాకు కథ, కథనాలను ప్రవీణ్‌ అందిస్తుండగా.. రాజేష్‌ ఆనందలీల దర్శకత్వం వహిస్తున్నారు. హరిహర పిక్చర్స్ మీద ఈ సినిమాను టి.ప్రవీణ్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. నోబిన్ పాల్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. విక్రమ్ మోర్ ఫైట్ మాస్టర్‌గా, రాకేష్ సి తిలక్ కెమెరామెన్‌గా, విశ్వ ఎన్ ఎమ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. మాటలు భార్గవ్ రామ్ అందిస్తుండగా, పాటలకు సాహిత్యాన్ని చల్లా భాగ్యలక్ష్మీ , జె లక్ష్మణ్ అందించారు.