Priyamani : అమెజాన్ ప్రైమ్‌లో.. ప్రియమణి మెయిన్ లీడ్ సినిమా ‘విస్మయ’..

"విస్మయ" సినిమాలో డాక్టర్‌గా ప్రియమణి నటించింది. కాంతారా ఫేమ్‌ కిషోర్‌ ఇన్వెస్టిగేషన్ చేసే పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తాడు. ఈ చిత్రంలో మూడు కథలు ఒకదానికొకటి అల్లుకుని ఉంటాయి. నగరంలో జరిగే హత్యలను ఇన్వెస్టిగేట్ చేసే క్రమంలో

Priyamani : అమెజాన్ ప్రైమ్‌లో.. ప్రియమణి మెయిన్ లీడ్ సినిమా ‘విస్మయ’..

Priyamani vismaya movie released in Amazon Prime

Priyamani :  సస్పెన్స్, థ్రిల్లర్ జానర్‌లో వచ్చే చిత్రాలకు ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు ఆడియెన్స్ టేస్ట్‌ కూడా మారిపోయింది. కంటెంట్ ఉన్న చిత్రాలను చూసేందుకు ఇష్టపడుతున్నారు. రొటీన్ కమర్షియల్ చిత్రాల కంటే కాన్సెప్ట్‌ ఓరియెంటెడ్ సినిమాలను చూస్తున్నారు. ఈ క్రమంలోనే కన్నడ నుంచి బ్లాక్ బస్టర్ చిత్రాలు వస్తున్నాయి. ప్రియమణి నటించిన కన్నడ చిత్రం “నన్న ప్రకార” అక్కడ బ్లాక్ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. ఇదే సినిమాను “విస్మయ” అంటూ ఇప్పుడు తెలుగులోకి డబ్ చేశారు. ప్రస్తుతం ఈ విస్మయ చిత్రం అమెజాన్‌లో అందరినీ ఆకట్టుకుంటోంది.

“విస్మయ” సినిమాలో డాక్టర్‌గా ప్రియమణి నటించింది. కాంతారా ఫేమ్‌ కిషోర్‌ ఇన్వెస్టిగేషన్ చేసే పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తాడు. ఈ చిత్రంలో మూడు కథలు ఒకదానికొకటి అల్లుకుని ఉంటాయి. నగరంలో జరిగే హత్యలను ఇన్వెస్టిగేట్ చేసే క్రమంలో చివర్లో వచ్చే ట్విస్టులు అందరినీ మెప్పిస్తాయి. దర్శకుడు వినయ్‌ బాలాజీకి ఇది మొదటి చిత్రమైనా కూడా ఎంతో అనుభవం ఉన్న డైరెక్టర్‌లా సినిమాను తెరకెక్కించారు. మొదట్లో షార్ట్ ఫిల్మ్స్ తీసి ఆ తరువాత వీఎఫ్ఎక్స్ ప్రొవైడర్‌గా పని చేసిన అనుభవాన్ని ఈ సినిమాలో చూపించారు. విస్మయ చిత్రంలో విజువల్స్, ఆర్ఆర్, కెమెరాపనితనం అన్నీ హైలెట్‌గా నిలిచాయి.

Mega Fans : వాల్తేరు వీరయ్య ప్రమోషన్స్ పై హర్ట్ అయిన మెగా ఫ్యాన్స్.. హైదరాబాద్ లో మెగా ఫ్యాన్స్ సమావేశం..

ప్రియమణి నటించిన ఈ “విస్మయ” చిత్రం ఇప్పుడు అమెజాన్‌లో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి అర్జున్ రాము సంగీతమందించారు. మనోహర్ జోషి కెమెరామెన్‌గా పని చేశారు.