Bigg Boss 5 : 75 రూపాయలతో ఇంట్లోంచి పారిపోయి ఇప్పుడు లక్షలు సంపాదిస్తున్నా: ప్రియాంక

మా నాన్న జేబులో నుంచి 50 రూపాయలు తీసుకుని రైల్వే స్టేషన్‌కు వెళ్లాను. కానీ అక్కడ హైదరాబాద్‌కు టికెట్‌ 75 రూపాయలు అని తెలిసింది. అంత డబ్బు నా దగ్గర లేదని మళ్లీ ఇంటికెళ్లి అక్కడ

Bigg Boss 5 : 75 రూపాయలతో ఇంట్లోంచి పారిపోయి ఇప్పుడు లక్షలు సంపాదిస్తున్నా: ప్రియాంక

Priyanka

Bigg Boss 5 :  బిగ్ బాస్ లో టాస్కులు, ఎంటర్టైన్మెంట్స్ తో పాటు కంటెస్టెంట్స్ జీవితాల్లోని బాధలు, సంతోషాల్ని కూడా షేర్ చేసుకుంటారు. చిన్న సెలబ్రిటీ అయినా పెద్ద సెలబ్రిటీ అయినా అందరూ ఆ స్టేజికి చాలా కష్టపడే ఉంటారు. ప్రతి ఒక్కరి సక్సెస్ వెనకాల ఎంతో కష్టం ఉంటుంది. బిగ్ బాస్ లో ఇటీవల కంటెస్టెంట్స్ అందరూ తమ లైఫ్ లో స్యాడ్ మూమెంట్స్ షేర్ చేసుకున్నారు. బిగ్ బాస్ ఇచ్చిన స్మైల్‌ చేయండి, స్టార్ట్‌ చేయండి టాస్క్‌లో భాగంగా హౌస్‌మేట్స్‌ అంతా వారి జీవితాల్లో ఎదుర్కొన్న కష్టాల్ని ప్రేక్షకులతో పంచుకున్నారు.

ఈ క్రమంలో ట్రాన్స్ జెండర్ ప్రియాంక సింగ్‌ తన జీవితం మొదలైన విధానం గురించి వివరించింది. ప్రియాంక తన గురించి చెప్తూ.. ఐదో తరగతి చదువుతున్నప్పటి నుంచి నన్ను నేను అర్థం చేసుకోవడం మొదలుపెట్టాను. మా ఊర్లో అందరూ నన్ను తేజు అని పిలిచేవారు. పెరిగేకొద్దీ నా జీవితంలో సమస్యలు చుట్టుముట్టాయి. చిన్నప్పుడే అమ్మ చనిపోయింది. నాన్న రెండో పెళ్లి చేసుకోవడంతో మా అమ్మ తిరిగి వచ్చినట్లైంది. కానీ పెద్దయ్యేకొద్దీ ఊర్లో నామీద ఫిర్యాదులు ఎక్కువయ్యాయి. నా ప్రవర్తనలో మార్పు వస్తోందని నాన్నతో చెప్పేవారు. పల్లెటూర్లో మాటలు ఎలా ఉంటాయో అందరికీ తెలుసు. అప్పుడు నేను అక్కడి నుంచి హైదరాబాద్‌ వెళ్లిపోవాలని ఫిక్సయ్యాను అని తెలిపింది.

Bigg Boss 5 : వరస్ట్ పర్ఫార్మర్ అన్నందుకు సన్నీకి ముద్దులిచ్చిన ప్రియా

అప్పుడు మా నాన్న జేబులో నుంచి 50 రూపాయలు తీసుకుని రైల్వే స్టేషన్‌కు వెళ్లాను. కానీ అక్కడ హైదరాబాద్‌కు టికెట్‌ 75 రూపాయలు అని తెలిసింది. అంత డబ్బు నా దగ్గర లేదని మళ్లీ ఇంటికెళ్లి అక్కడ దేవుడికి ముడుపు కట్టిన డబ్బులను తీసుకుని హైదరాబాద్‌ వచ్చేశాను. హైదరాబాద్‌కు వచ్చేసరికి నా దగ్గర రెండు రూపాయలు మాత్రమే మిగిలాయి. ఒక రూపాయి కాయిన్‌తో మాదాపూర్‌లో ఉన్నమా అక్కకి ఫోన్‌ చేస్తే వాళ్లు వచ్చి తీసుకెళ్లారు. అప్పుడు అనుకోకుండా ఒక సినిమాలో నటించే అవకాశం వచ్చింది చేశాను.

Bigg Boss 5 : మానస్ ప్రియాంకలకి పెళ్లి చేసిన బిగ్ బాస్

ఆ తర్వాత జబర్దస్త్ అప్పారావు బాబాయి నువ్వు బాగున్నావు లేడీ గెటప్‌ వేస్తావా అని అడిగాడు. అమ్మాయిగా కనిపించాలనే కోరిక కూడా తీరుతుందని వెంటనే ఓకే చెప్పాను. అలా కామెడీ షోలో కెరీర్‌ స్టార్ట్‌ చేశాను. తేజు టీవీలో కనిపిస్తున్నాడంటూ ఊరంతా ప్రచారం జరిగింది. అప్పుడు నా మొదటి సంపాదన 300 రూపాయలు. ఇప్పుడు లక్షల్లో సంపాదిస్తున్నాను అని చెప్పి ఏడ్చేసింది ప్రియాంక.