భార్యాభర్తలు గుర్రమెక్కారు..

ప్రియాంక చోప్రా - నిక్ జోనాస్ ‘హార్స్ రైడింగ్’ ఎంజాయ్ చేస్తున్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

  • Published By: sekhar ,Published On : March 3, 2020 / 02:18 PM IST
భార్యాభర్తలు గుర్రమెక్కారు..

ప్రియాంక చోప్రా – నిక్ జోనాస్ ‘హార్స్ రైడింగ్’ ఎంజాయ్ చేస్తున్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనాస్‌తో కలిసి బీచ్‌లో గుర్రపు స్వారీ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. తీరిక దొరికినప్పుడల్లా ఈ జంట హాలీడే టూర్లు వేస్తూ.. ఒకరిపై ఒకరికున్న ప్రేమను వివిధ రకాలుగా వ్యక్తపరుస్తూ వాటికి సంబంధించిన ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటుంటారు ఈ జంట..

Priyanka Chopra, Nick Jonas

తాజాగా భార్యాభర్తలిద్దరూ స్టైలిష్ కాస్ట్యూమ్స్, కౌబాయ్ హ్యాట్ర్స్ ధరించి బీచ్‌లో చెట్టాపట్టాలేసుకొని సరాదాగా స్వారీ చేశారు. ప్రియాంకా, నిక్ జోనాస్‌లు కలిసి చేతులు పట్టుకొని ఆనందంగా చేసిన హార్స్ రైడింగ్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు.

‘లవ్లీ పిక్స్.. మీరిద్దరూ ప్రేమను రోజుకో రకంగా రుచి చూస్తున్నారు’ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రియాంక ప్రస్తుతం హాలీవుడ్, బాలీవుడ్‌లో ఎక్కడా సినిమాలు చేయట్లేదు కానీ నిక్ మాత్రం తన జోనాస్ బ్రదర్స్ ట్రూప్ తరపున మ్యూజికల్ టూర్స్‌తో బిజీగా ఉన్నాడు. తాజాగా ‘ది వాయిస్ సీజన్ 18’ లోకి ఎంటరయ్యాడు. 
Priyanka Chopra And Nick Jonas Horse Riding