న్యూయార్క్‌లో రెస్టారెంట్ ఓనర్‌గా మారిన ప్రియాంక చోప్రా

న్యూయార్క్‌లో రెస్టారెంట్ ఓనర్‌గా మారిన ప్రియాంక చోప్రా

newyork priyanka chopra

Priyanka Chopra: ప్రస్తుతం Citadel ప్రాజెక్టు షూటింగ్‌లో ఉన్న ప్రియాంక చోప్రా.. రెస్టారెంట్ ఓనర్ అయిపోయారు. నటిగా, నిర్మాతగా ఉన్న ప్రియాంక న్యూయార్క్ లో రెస్టారెంట్ ఓపెన్ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను షేర్ చేసిన ఆమె.. ఇక్కడ ఇండియన్ ఫుడ్ అందించాలని ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు. ఇంతకీ ఈ రెస్టారెంట్ పేరెంటో తెలుసా.. సోనా.

ఓపెనింగ్ సందర్భంగా జరిగిన పూజా కార్యక్రమాన్ని తన భర్త నిక్ జోనస్ తో కలిసి చేస్తున్న ఫొటోలను పోస్టు చేశారు. ‘సోనాను మీకు చూపించడాన్ని థ్రిల్ గా ఫీలవుతున్నా. న్యూయార్క్ లోని కొత్త రెస్టారెంట్ లో ప్రేమతో ఇండియన్ ఆహారం అందించాలనుకుంటున్నా. చిన్నప్పటి నుంచి నేను తిన్న ఫుడ్, అద్భుతమైన వంటకాలు మంచి చెఫ్ చేతుల మీదుగా రెడీ అవుతున్నాయి.

ఈ మెనూలో ఫుడ్ తిన్న వారికి నా దేశ అద్భుతాలను రుచి చూస్తారు. ఏప్రిల్ లో సోనా ఓపెనింగ్ ఉంటుంది. మనీశ్ గోయెల్, డేవిడ్ ర్యాబిన్ లీడర్ షిప్ తోనే ఇదంతా సాధ్యమైంది. డిజైనర్ మెలిస్సా బోయర్స్ కు థ్యాంక్స్. అంటూ పోస్టులు పెట్టారు.