Priyanka Chopra : రెండున్నర కోట్లకు తన కార్‌ని అమ్మేసిన ప్రియాంక చోప్రా

ప్రియాంక దగ్గర ఉన్న రోల్స్ రాయల్స్ కార్ బాలీవుడ్ లో మొదట కొన్నది తనే. ఈ కార్ ధర అక్షరాలా రెండున్నర కోట్లు. అయితే ప్రియాంక అమెరికా వెళ్లిపోయిన తర్వాత ఆ కార్ ని ఇక్కడే షెడ్ లో.......

Priyanka Chopra : రెండున్నర కోట్లకు తన కార్‌ని అమ్మేసిన ప్రియాంక చోప్రా

Priyanka

 

Priyanka Chopra :  బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ప్రస్తుతం హాలీవుడ్ లో బిజీగా ఉండి హాలీవుడ్ స్టార్ అయిపోయింది. బాలీవుడ్ ని పూర్తిగా వదిలేసి హాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఇక నిక్ జోనస్ ని పెళ్లి చేసుకొని అమెరికాలోనే సెటిల్ అయిపోయింది ఈ బాలీవుడ్ బ్యూటీ. అమెరికాలో సొంత ఇల్లు కూడా కట్టేసుకుంది ప్రియాంక. అయితే ప్రియాంకకి ముంబైలో కూడా ఇళ్ళు, ఆస్తులు ఉన్న సంగతి తెలిసిందే. ప్రియాంక ఆస్తుల్లో ఖరీదైన వాటిల్లో రోల్స్ రాయల్స్ ఘోస్ట్ కార్ కూడా ఒకటి.

Rolls Royce

ప్రియాంక దగ్గర ఉన్న రోల్స్ రాయల్స్ కార్ బాలీవుడ్ లో మొదట కొన్నది తనే. ఈ కార్ ధర అక్షరాలా రెండున్నర కోట్లు. అయితే ప్రియాంక అమెరికా వెళ్లిపోయిన తర్వాత ఆ కార్ ని ఇక్కడే షెడ్ లో ఉంచేసింది. దాన్ని ఎవరూ వాడట్లేదు కూడా. రెండున్నర కోట్ల కార్ ఖాళీగా షెడ్ లో ఉండటం తనకి ఇష్టం లేదట. అందుకే ఆ కార్ ని అమ్మేయాలనుకుంది ప్రియాంక చోప్రా. ఇక్కడ తనకి తెలిసిన వారితో ఆ కార్ బేరం పెట్టింది. తాజాగా ప్రియాంక చోప్రా ఫేవరేట్ కార్ అయిన ఈ రోల్స్ రాయల్స్ ని అమ్మేసింది. బెంగళూరుకు చెందిన ఓ వ్యాపారవేత్తకు ఈ కార్ ని అమ్మేసినట్లు తెలిస్తోంది.