ది పవర్ ఫుల్ ఉమెన్..ప్రియాంకా

ది పవర్ ఫుల్ ఉమెన్..ప్రియాంకా

ది పవర్ ఫుల్ ఉమెన్..ప్రియాంకా

మరో అరుదైన గౌరాన్ని సంపాదించుకుంది ప్రియాంకా చోప్రా.గ్లోబల్ ఐకాన్ గా గుర్తింపు పొందిన ఆమె ఇప్పుడు ఎంటర్ టైన్ మెంట్ రంగంలో ఈ ఏడాదికి గానూ అత్యంత శక్తిమంతమైన 50 మంది మహిళల జాబితాలో ఆమె చోటు దక్కించుకున్నారు. ఈ మేరకు యూఎస్‌ఏ టుడే  ఉమెన్‌ ఇన్‌ ది వరల్డ్‌ సమ్మిట్‌- 2019 జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో ప్రియాంక అమెరికాకు చెందిన స్టార్స్‌ ఓప్రా విన్‌ఫ్రే, మెరిల్‌ స్ట్రీప్‌ లతోపాటు ఉన్నారు. న్యూయార్క్‌ లో ఏప్రిల్‌ 10 నుంచి 12 వరకు వేడుక జరగనుంది. ఈ జాబితాలో గాయని బియాన్సే, టీవీ స్టార్‌ ఎలెన్‌ దెజానరెస్‌, జెన్సీఫర్‌ లారెన్స్‌, జెన్సీఫర్‌ లోపెజ్‌ కూడా ఉన్నారు.

తనను శక్తివంతమైన మహిళల జాబితాలో ఎంపిక చేయడంపై ప్రియాంకా చోప్రా ఆనందం వ్యక్తం చేశారు .ఇది తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు.సవాళ్లను ఎదుర్కొంటూ.. సొంతంగా తమకంటూ ఓ ప్రత్యేకమైన మార్గం ఏర్పరచుకుని.. ఎంచుకున్న కెరీర్‌లో గర్వంగా రాణిస్తున్న ఇలాంటి అద్భుతమైన మహిళలతో కలిసి వేదిక పంచుకోబోతుండటం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నా, ఇది నా విజయం అనే భావన కలుగుతోందటూ ఆమె ట్రీట్ చేశారు.

 అమెరికన్‌ టెలివిజన్‌ సిరీస్‌ ‘క్వాంటికో’తో ప్రియాంక అంతర్జాతీయంగా ఫేమస్‌ అయ్యారు. 2017లో బేవాచ్ సినిమాతో హాలివుడ్ కు పరిచమైన ప్రియాంకా చోప్రా గతేడాది డిసెంబర్  అమెరికాకు చెందిన సింగర్ నిక్‌ జొనస్‌ ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

×