నిజానికి పెద్ద కలలే ఉన్నాయ్.. అమ్మాయిని కావడమే అడ్డు అయింది-ప్రియాంక చోప్రా నోటివెంట ఈ మాటల వెనుక ఏముందో..

నిజానికి పెద్ద కలలే ఉన్నాయ్.. అమ్మాయిని కావడమే అడ్డు అయింది-ప్రియాంక చోప్రా నోటివెంట ఈ మాటల వెనుక  ఏముందో..

ప్రియాంక చోప్రా గురించి దేశం మొత్తంలో ఎవరిని అడిగినా చెప్పేస్తారు. అంతగా ఫ్యామస్ అయిపోయింది ఈ ప్రియాంక. తన వయస్సులో మూడు వంతు వయస్సు ఉన్న వ్యక్తిని పెళ్లాడి.. వార్తల్లో నిలిచారు. ఇవేకాకుండా, ఆమెకు చాలానే కలలు ఉన్నాయట. పైగా వాటన్నిటినీ కేవలం అమ్మాయి కావడమే అడ్డుగా మారిందని, అందుకే వాటిని నిజం చేసుకోలేకపోయానని స్వయంగా ఆమె నోటి నుంచే వచ్చింది.

నేను చాలా చిన్న ఊళ్లో పెరిగాను. చాలామంది కలలు అనేవి నిజయం కావు అంటారు. అలాగే అమ్మాయి కల నిజం చేసుకోవాలంటే ఆశ వదులుకోవాల్సిందే అని ఓ టీవీ ఇంటర్వ్యూలో అన్నారట. ఈ ప్రోగ్రాంకు డచెస్ ఆఫ్ సస్సెక్స్, మిచెల్ ఒబామా హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.

అదృష్టవశాత్తు ప్రియాంక చోప్రాకు కలను నిజం చేసుకోవడానికి బాగా ఎంకరేజ్ చేసే కుటుంబం దొరికింది. ‘దేవుడి దయతోనే నాకు ఇలాంటి కుటుంబం దొరికింది. అవే నాలో మంచి విలువలు పెండంతో పాటు, స్ట్రాంగ్, న్యాయమైన పనులు చేసేలా ఉసిగొల్పుతున్నాయి. నేనేమైనా చేయగలననే నమ్మకాన్ని కూడా వారే నాకిచ్చారు. అమ్మాయా.. అబ్బాయా అనే తేడా లేకుండా చేయగలుగుతున్నా.

నా భవిష్యత్ ను తీర్చిదిద్దుకోవడానికి సాయం చేశారు. ఆరంభం నుంచే విశాలమైన సరిహద్దు ఉంచుకునే పెరిగాను. ఈ మార్పులో సైనికుడిలా ఎదిగాను. మీరు ఆలోచిస్తే ఇది మీ నుంచి కూడా మొదలవుతుంది. అది సాధించడానికి సోషల్ మీడియాలో ఏమీ మిలియన్ల కొద్దీ ఫాలోవర్లు ఉండాల్సిన అవసరం లేదు.

దీనికి అందరికీ కావాలసింది మనస్సు, చేయాలనే మనస్తత్వం, సంకల్పం. ఏ పనీ చిన్నది కాదు. ఎవరి వయస్సు తక్కువ కాదు. మనమెప్పుడైతే ఎదిగామో అప్పుడే అద్భుతాలు సృష్టించగలం. ఇవి చెప్తూ ప్రియాంక చోప్రా రియల్ లైఫ్ లో ప్రేరణగా నిలిచిన కొందరు స్త్రీ మూర్తుల గురించి ఉదహరించారు.