ఆన్ లైన్ పిటిషన్ : ప్రియాంక చోప్రా UN రోల్ తొలగించాలి!

యూనిసెఫ్ గుడ్ విల్ అంబాసిడర్ పోస్టు నుంచి బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రాను తొలగించాలని ఓ ఆన్ లైన్ పిటిషన్ దాఖలైంది.

  • Published By: sreehari ,Published On : March 4, 2019 / 10:43 AM IST
ఆన్ లైన్ పిటిషన్ : ప్రియాంక చోప్రా UN రోల్ తొలగించాలి!

యూనిసెఫ్ గుడ్ విల్ అంబాసిడర్ పోస్టు నుంచి బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రాను తొలగించాలని ఓ ఆన్ లైన్ పిటిషన్ దాఖలైంది.

యూనిసెఫ్ గుడ్ విల్ అంబాసిడర్ పోస్టు నుంచి బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రాను తొలగించాలని ఓ ఆన్ లైన్ పిటిషన్ దాఖలైంది. పాకిస్థాన్ లోని బాల్ కోట్ లో ఉగ్రవాదుల శిబిరాన్ని ఐఎఎఫ్ వైమానిక దళాలు ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేసిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ను జైహింద్.. ఇండియన్ ఆర్మీ అంటూ (ఫిబ్రవరి 26, 2019) ప్రియాంక ట్విట్టర్ వేదికగా అభినందించింది.
Also Read : పాక్ కు బుద్ధి చెప్పాల్సిందే : ఐరాస వద్ద నిరసల హోరు

ప్రియాంక ట్వీట్ ను కొందరు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో అవాజ్ అనే ఆన్ లైన్ ప్లాట్ ఫాం సంస్థ ప్రియాంకపై ఆన్ లైన్ పిటిషన్ వేసింది. యూనిసెఫ్ మెంబర్ గా ఉన్న ప్రియాంక.. రెండు దేశాల మధ్య నిష్పాక్షపతంగా వ్యవహరించాల్సి ఉంటుంది. గుడ్ విల్ అంబాసిడర్ హోదాలో న్యూట్రల్ గా ఉండాల్సింది పోయి ఒక దేశాన్ని మాత్రమే సమర్థించడాన్ని అవాజ్ తప్పుబట్టింది. ‘‘రెండు అణుశక్తుల మధ్య యుద్ధం జరిగితే.. అది వినాశానికే దారితీస్తుంది. 

UNICEF గుడ్ విల్ అంబాసిడర్ గా ఉన్న ప్రియాంక.. న్యూట్రల్ గా లేదా శాంతియుతంగా ఉండాలి. యూనిసెఫ్ టైటిల్ కు ప్రియాంక అర్హులు కాదు’’ అని పిటిషన్ లో తెలిపింది. ఈ ఆన్ లైన్ పిటిషన్ కు యూనైటెడ్ నేషన్స్, యూనిసెఫ్ కు 4వేల 200 సంతకాలను సేకరించి జోడించారు. దీనిపై యూనిసెఫ్ ఇప్పటివరకూ ఎలాంటి కామెంట్ చేయలేదని రిపోర్ట్స్ టిఎంజెడ్.కామ్ పేర్కొంది. 2016లో ప్రియాంక చోప్రా గ్లోబల్ యూనిసెఫ్ గుడ్ విల్ అంబాసిడర్ గా నియమితులైంది. 10ఏళ్లుగా యూనిసెఫ్ మెంబర్ గా ప్రియాంక వ్యవహరిస్తోంది. అవాస్ పిటిషన్ పై ప్రియాంక చోప్రా ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరోవైపు ప్రియాంక ట్వీట్ ను మరికొందరు సమర్థిస్తున్నారు. ఒక ఇండియన్ గా తన సంతోషాన్ని వ్యక్తం చేసింది..  ప్రియాంక చేసిన ట్వీట్ లో తప్పు ఏముందిని  ప్రశ్నిస్తున్నారు. 
Also Read : అభినందన్ అరుదైన రికార్డ్ : F-16 కూల్చిన తొలి IAF కమాండర్