Bigg Boss Priyanka : బిగ్‌బాస్‌ లో ప్రియాంక రెమ్యునరేషన్ ఎంత??

బిగ్ బాస్ సీజన్‌-5లో 9వ కంటెస్టెంట్‌గా ప్రియాంక హౌస్‌లోకి అడుగు పెట్టింది. ఒక ట్రాన్స్ జెండర్ గా అడుగుపెట్టిన ప్రియాంక గతంలో ట్రాన్స్ జెండర్స్ వెళ్ళిపోయినట్టే......

Bigg Boss Priyanka :  బిగ్‌బాస్‌ లో ప్రియాంక రెమ్యునరేషన్ ఎంత??

Priyanka

Bigg Boss Priyanka :  చాలామంది సెల‌బ్రిటీల‌కు బిగ్‌బాస్‌ ఒక మంచి సపోర్ట్ గా పని చేస్తుంది. కెరీర్ డల్ గా ఉన్న వాళ్ళకి, కెరీర్ ఆరంభంలో ఉన్న వాళ్ళకి బిగ్ బాస్ బాగా ఉపయోగపడుతుంది. బిగ్ బాస్ తో స్టార్స్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. బిగ్ బాస్ కి వచ్చే వాళ్ళకి వారానికి ఇంత అని పారితోషికం కూడా ఇస్తారు బిగ్ బాస్ నిర్వాహకులు. ఈ పారితోషికం కూడా ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. అప్పటి వరకు వాళ్ళ కెరీర్ ని బట్టి, సోషల్ మీడియాలో వాళ్ళ ఫాలోయింగ్ ని బట్టి ఈ పారితోషికం ఉంటుంది. బిగ్ బాస్ లో ఎన్ని వారాలు ఉంటే అంత పారితోషికం లెక్కపెట్టి మరీ ఇస్తారు నిర్వాహకులు.

Akhanda : ‘అఖండ’ సీక్వెల్ ప్లాన్.. స్టోరీ ఇదేనా??

ఒక్కో కంటెస్టెంట్ బయటకి వస్తుంటే వాళ్ళ పారితోషిక వివరాలు కూడా బయటకి వస్తున్నాయి. ఇటీవల ప‌ద‌మూడో వారం ప్రియాంక సింగ్ ఎలిమినేట్ అయింది. అంతకుముందు జబర్దస్త్ లాంటి కామెడీ షోలు చూసే వాళ్లకు మాత్రమే తెలిసిన ప్రియాంక బిగ్ బాస్ తర్వాత చాలా మంది అభిమానులని సంపాదించుకుంది. ఇక బిగ్ బాస్ నుంచి బయటకి వచ్చాక ఇంటర్వూస్ ఇస్తూ తనని తానూ ప్రమోట్ చేసుకుంటుంది. తాజాగా ఆమె పారితోషికం వివరాలు వైరల్ అవుతున్నాయి.

Pushpa : ‘పుష్ప’ టీం మెంబర్స్‌కి గోల్డ్‌రింగ్స్ గిఫ్ట్‌గా ఇచ్చిన ఐకాన్ స్టార్

బిగ్ బాస్ సీజన్‌-5లో 9వ కంటెస్టెంట్‌గా ప్రియాంక హౌస్‌లోకి అడుగు పెట్టింది. ఒక ట్రాన్స్ జెండర్ గా అడుగుపెట్టిన ప్రియాంక గతంలో ట్రాన్స్ జెండర్స్ వెళ్ళిపోయినట్టే రెండు మూడు వారాల్లోనే వెళ్ళిపోతుంది అనుకున్నారు. కానీ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ప్రియాంక మొత్తం 91 రోజులు హౌజ్‌లో ఉంది. దీంతో ప్రియాంక ఓ వైపు అభిమానులతో పాటు మరో వైపు డబ్బులు కూడా బాగానే సంపాదించింది. ఆమెకు బిగ్ బాస్ నిర్వాహకులు వారానికి లక్ష రూపాయలకు పైగా రెమ్యున‌రేష‌న్ ఇచ్చినట్టు సమాచారం. అంటే 13 వారాలకు మొత్తంగా దాదాపు పదమూడు లక్షలకు పైగానే సంపాదించినట్టు తెలుస్తుంది.