Bigg Boss 5: పింకీ ఔట్.. ఈ వారం ఎలిమినేషన్ అయ్యేది ఈమేనా?

బిగ్ బాస్ ఐదవ సీజన్ చివరి అంకానికి చేరుకుంది. ప్రస్తుతం ఇంట్లో ఎనిమిది మంది మాత్రమే ఉండగా 11 మంది ఎలిమినేట్ అయ్యారు. ఈ వారం ఎనిమిదిలో మరొకరు ఇంట్లో నుండి బయటకి రావాల్సి ఉంది.

Bigg Boss 5: పింకీ ఔట్.. ఈ వారం ఎలిమినేషన్ అయ్యేది ఈమేనా?

Bigg Boss 5

Bigg Boss 5: బిగ్ బాస్ ఐదవ సీజన్ చివరి అంకానికి చేరుకుంది. ప్రస్తుతం ఇంట్లో ఎనిమిది మంది మాత్రమే ఉండగా 11 మంది ఎలిమినేట్ అయ్యారు. ఈ వారం ఎనిమిదిలో మరొకరు ఇంట్లో నుండి బయటకి రావాల్సి ఉంది. నిజానికి ఇది ఈ పాటికే జరిగిపోయి ఉంటుంది కానీ.. ఆదివారం మాత్రమే ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది. అయితే.. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరన్నది బిగ్ బాస్ అభిమానులలో ఉత్కంటగా మారింది. ఉన్న ఎనిమిది మందిలో ఎవరు వీక్ కంటెస్టెంట్ అనే లెక్కలేసుకొని మరీ వీక్షకులు ఒక అభిప్రాయానికి వస్తున్నారు.

Katrina Kaif: క్యాట్-విక్కీ మ్యారేజ్ మిస్టరీ.. కన్ఫ్యూజన్‌లో ఫ్యాన్స్!

కాగా.. ఈ వారం తానే ఇంటి నుండి ఎలిమినేట్ అవుతానని ప్రియాంకా మెంటల్ గా ఫిక్స్ అయిపొయింది. అన్‌సీన్‌ వీడియోలో మానస్‌ దగ్గరకు వెళ్లి కూర్చున్న ప్రియాంక.. ఈ వీక్‌ నేను వెళ్లిపోతానని చెప్పేసింది. తాను ఇంటి వెళ్ళిపోయినా.. మానస్ జాగ్రత్తగా ఉండాలని జాగ్రత్తలు చెప్పుకొచ్చింది. ప్రతిరోజూ బొట్టు పెట్టుకుని పడుకోవాలని, సమయానికి భోజనం చేస్తూ బట్టలు ఎప్పటికప్పుడు ఉతికేసుకోమని చెప్పింది. రెండు రోజులకొకసారి తలకు నూనె పెట్టుకో అని మానస్‌కు ఎన్నెనో జాగ్రత్తలు చెప్పింది.

December Film Releases: ఇయర్ ఎండ్ సిల్వర్ స్క్రీన్ స్టార్ హీరోలదే!

అయితే, ఆమె మాటలను మధ్యలో అడ్డుకున్న మానస్ నువ్వు ఏం వెళ్లిపోవులే అని సముదాయించే ప్రయత్నం చేశాడు. కానీ పింకీ మాత్రం ఎందుకో నేను వెళ్లడం ఫిక్సని అర్థమైందని కరాఖండిగా తేల్చేసింది. దీనికి మానస్ హౌస్‌లో ఇప్పటికే చాలా రోజులు ఎక్కువ ఉండిపోయాననుకుంటున్నావా అని మధ్యలో పంచ్‌ వేయడంతో పింకీ ఆపేసింది. మరి ఇంతకీ పింకీ అంచనా నిజమవుతుందా లేక సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతున్నట్లుగా కాజల్, పింకీ, సిరిలో ఎవరు అవుతారా అన్నది చూడాల్సి ఉంది.