నిర్మాత బండ్ల గణేష్‌కు కరోనా పాజిటివ్..!

  • Published By: vamsi ,Published On : June 20, 2020 / 03:09 AM IST
నిర్మాత బండ్ల గణేష్‌కు కరోనా పాజిటివ్..!

Bandla-Ganesh

కరోనా మహమ్మారి కారణంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా వేల సంఖ్యలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే లేటెస్ట్‌గా టాలీవుడ్‌ నిర్మాత బండ్ల గణేష్‌కు కూడా కరోనా పాజిటివ్ వచ్చినట్లుగా తెలుస్తుంది. కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చి నిర్మాతగా మారిన బండ్ల గణేష్‌కు కరోనా వైరస్ సోకినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

హైదరాబాద్, శంషాబాద్ సహా బండ్ల గణేష్ ఉండే షాద్‌నగర్ వైపు కూడా కరోనా కేసులు ఎక్కువగా వస్తున్నాయి. ఈ క్రమంలోనే అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా బండ్లకు పాజిటివ్ వచ్చిందని వార్తలు రావడంతో సినిమా ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కుటుంబ సభ్యులతో పాటు ఆయనతో సన్నిహితంగా ఉన్నవాళ్లు కూడా కరోనా పరీక్షలు చేయించుకున్నట్లు చెబుతున్నారు.

హెయిర్ ప్లాంటేషన్ కోసం వెళ్లిన గణేష్‌ను అక్కడ ముందుగా కరోనా టెస్ట్ చేసుకోవాలని సూచించగా.. తీరా చేసిన తర్వాత పాజిటివ్‌గా నిర్దారణ అయిందని అంటున్నారు. అయితే అఫిషియల్‌గా మాత్రం దీనిపై ఎటువంటి ప్రకటన రాలేదు. ప్రస్తుతం బండ్ల గణేష్ క్వారంటైన్‌లో ఉండి చికిత్స పొందుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. బండ్ల గణేష్ కూడా ఇప్పటివరకు దీనిని ఖండించలేదు. 

Read: త్వరలో మరికొంత మంది చనిపోతారు – సోనూ నిగమ్ సెన్సేషనల్ కామెంట్స్