Balayya : బాలకృష్ణతో పాన్ వరల్డ్ సినిమాని నిర్మించబోతున్నాం..

ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ పుట్టిన రోజు కావడంతో ఆయన మీడియాతో ముచ్చటించారు. సినిమాల గురించి, టాలీవుడ్ గురించి పలు అంశాలని మాట్లాడారు సి.కళ్యాణ్. అలాగే బాలకృష్ణతో తీయబోయే సినిమా గురించి కూడా మాట్లాడారు...............

Balayya : బాలకృష్ణతో పాన్ వరల్డ్ సినిమాని నిర్మించబోతున్నాం..

producer C kalyan planning pan world cinema with balakrishna

Balayya :  ప్రస్తుతం బాలయ్య బాబు ఫుల్ ఫామ్ లో ఉన్నారు. అఖండ సినిమా భారీ హిట్ అవ్వడం, బాలయ్య కెరీర్ లో మొదటి 100 కోట్ల సినిమా అవ్వడం, అన్‌స్టాపబుల్ షో సూపర్ సక్సెస్ అయి సీజన్ 2 కూడా మొదలుపెట్టడం, వీరసింహ రెడ్డిపై ఫుల్ అంచనాలు ఉండటం.. మొత్తానికి బాలకృష్ణ గత సంవత్సరం నుంచి ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇటీవలే అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా ఓపెనింగ్ కూడా అయింది.

ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ పుట్టిన రోజు కావడంతో ఆయన మీడియాతో ముచ్చటించారు. సినిమాల గురించి, టాలీవుడ్ గురించి పలు అంశాలని మాట్లాడారు సి.కళ్యాణ్. అలాగే బాలకృష్ణతో తీయబోయే సినిమా గురించి కూడా మాట్లాడారు.

Ram Charan : మోస్ట్ పాపులర్ ఇండియన్ స్టార్స్ లిస్ట్‌లో.. బన్నీ, ఎన్టీఆర్ కంటే ముందు స్థానంలో రామ్‌చరణ్..

సి.కళ్యాణ్ మాట్లాడుతూ.. త్వరలో నందమూరి బాలకృష్ణతో ‘రామానుజాచార్య’ అనే సినిమాని అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నాము. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలోనే దీని గురించి అధికారికంగా ప్రకటన చేస్తాం” అని తెలిపారు. అయితే టైటిల్ చూస్తే డివోషనల్ సినిమాలా ఉంది, మరి పాన్ వరల్డ్ ఎలా చేస్తారా అని అనుకుంటున్నారు బాలయ్య అభిమానులు. ఇక బాలయ్య బాబు సంక్రాంతికి వీరసింహారెడ్డి సినిమాతో రాబోతున్నారు.